Pushpa Movie: Who Are The Villains In Allu Arjun Movie - Sakshi
Sakshi News home page

Pushpa Movie: పుష్పరాజ్‌ కోసం వాళ్లని సెట్‌ చేసిన సుకుమార్‌

Published Thu, Dec 16 2021 6:05 PM | Last Updated on Mon, Dec 20 2021 11:39 AM

Who Are The Villains In Allu Arjun Pushpa Movie - Sakshi

Villains In Allu Arjun Pushpa Movie:స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పుష్ప సినిమా కోసం ఊరమాస్‌ లుక్‌లో పుష్పరాజ్‌గా అవతారం ఎత్తాడు. బన్నీ కెరీర్‌లోనే పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్‌ చేశాడు సుకుమార్‌. హీరో పాత్రను పాన్‌ ఇండియా లెవల్‌లో ఎలివేట్‌ చేయాలంటే విలన్లు అంతకుమించిన స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకే పుష్పరాజ్‌కు ప్రతినాయకులుగా క్రేజీ స్టార్స్‌ను సెట్‌ చేశాడు సుకుమార్‌. విలన్ పాత్రల్లో హీరో, కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు ఉండటం విశేషం.

ఈ లిస్ట్‌లో మొదటగా చెప్పుకోవాల్సింది ఫాహద్‌ ఫాజిల్‌. అప్పటివరకు మలయాళ ప్రేక్షకులకు మాత్రమే తెలిసిన ఫాహద్‌ కరోనా సమయంలో వరుస హిట్లతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటివరకు హీరోగానే చేస్తూ వచ్చిన ఈ మలయాళ స్టార్‌ హీరో పుష్ప సినిమా కోసం తొలిసారిగా పవర్‌ఫుల్‌ ప్రతినాయకుడిగా మారారు. ఇక 'భైరవగీత' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ధనుంజయ్‌ ఆ తర్వాత శాండల్‌వుడ్‌లో బిజీ అయ్యాడు. ఇప్పుడు ఈ హీరో కూడా పుష్పరాజ్‌తో యుద్ధానికి సిద్ధమయ్యాడు.

ఇక ఒకప్పటి టాలీవుడ్‌ కమెడియన్‌ సునీల్‌ కూడా విలన్‌గా మారోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ సినిమాలో మంగళం శ్రీనుగా సర్‌ప్రైజ్‌ చేస్తానంటూ ఊరిస్తున్నాడు. అలాగే యాంకర్‌ అనసూయ,అజయ్‌ ఘోష్‌, శత్రు వంటి విలన్లు కూడా పుష్పరాజ్‌ను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement