ఓటీటీలో ఆవేశం.. ఆ సీన్‌పై చర్చ! | Fahad Faasil Refuses To Warn In Hindi Language In Aavesham Movie Scene, Creates Controversy | Sakshi
Sakshi News home page

Aavesham Scene Controversy: ఓటీటీలో ఆవేశం.. ఆ భాష అక్కర్లేదా? అలా అవమానిస్తారా?

Published Sun, May 12 2024 10:07 AM | Last Updated on Sun, May 12 2024 1:48 PM

Aavesham: Fahad Faasil Refuses to Warn in Hindi language

ఫహద్‌ ఫాజిల్‌.. అప్పుడే హీరోగా చేస్తాడు.. అంతలోనే విలన్‌గా నటిస్తాడు. ప్రాధాన్యతను బట్టి ఏ పాత్రలో అయినా దూరేస్తాడు. ఇటీవల అతడు హీరోగా నటించిన మలయాళ మూవీ ఆవేశం బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీలో ఆవేశం
బాక్సాఫీస్‌ దగ్గర హిట్టందుకున్న మూవీ ఓటీటీలోకి రావడంతో సినీప్రియులు ఆత్రుతగా ఆవేశం సినిమా చూసేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సినిమాలోని ఓ సీన్‌ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. హిందీ భాషను కావాలని పక్కన పడేశారని కామెంట్లు చేస్తున్నారు.

ఫైట్‌ సీన్‌లో వార్నింగ్‌
ఇంతకీ ఏమైందంటే.. ఓ ఫైట్‌ సీన్‌లో రంగ(ఫహద్‌ ఫాజిల్‌) తన కాలేజీలోని సీనియర్లు అజు, బిబి, షాంతన్‌కు వార్నింగ్‌ ఇస్తుంటాడు. మలయాళం, కన్నడ భాషల్లో వార్నింగ్‌ ఇస్తాడు. హిందీలో కూడా ఇద్దామనుకునేసరికి హిందీలో అవసరం లేదులే అంటూ రంగ రైట్‌ హ్యాండ్‌ అంబాన్‌ (సాజిన్‌ గోపు) అతడిని వారిస్తాడు. 

హిందీ అక్కర్లేదా?
అందరికీ చెప్పింది అర్థమైందిగా.. ఇక వెళ్లిపోండి అని ఆదేశిస్తాడు. హిందీలో అవసరం లేదా? అని హీరో అడిగితే అంబాన్‌ వద్దని బదులిస్తాడు. ఇది చూసిన కొందరు అధికార భాష హిందీని గౌరవించాలి కదా అని అభిప్రాయపడగా.. అయినా ప్రాంతీయ భాషా చిత్రంలో హిందీ అవసరం ఏముందిలే అని మరికొందరు లైట్‌ తీసుకుంటున్నారు.

చదవండి: ఓ మంచి దెయ్యం టీజర్‌ చూశారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement