
ఫాహద్ ఫాజిల్, నజ్రియా నజీమ్
నయనతారకు సిస్టరా?.. నజ్రియా నజీమ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది ఇలానే అనుకున్నారు. ఎందుకంటే నయనతార పోలికలు కొంచెం నజ్రియాలో కనిపిస్తాయి. ఆ సంగతలా ఉంచితే నజ్రియా చాలా క్యూట్‌గా ఉంటారు. తన అమాయకపు నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో చాలామంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారామె. నటుడు ఫాహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. నజ్రియా నటించిన లాస్ట్ మూవీ ‘బెంగళూర్ డేస్’. విశేషం ఏంటంటే ఆ సినిమాలో ఫాహద్ భార్యగానే నటించారామె.
మళ్లీ మలయాళ స్క్రీన్‌పై కనిపించటానికి రెడీ అయ్యారు నజ్రియా. ‘బెంగళూర్ డేస్’ డైరెక్ట్‌ర్ అంజలి మీనన్ డైరెక్షన్‌లో ప్రస్తుతం ఓ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారామె. ఈ సినిమాలో పార్వతి, పృథ్వీరాజ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇది కాకుండా భర్త ఫాహద్‌తో ఓ సినిమాలో కనిపిస్తారట నజ్రియా. అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ట్రాన్స్’ సినిమాలో ఫాహద్‌కు జోడీగా నజ్రియాను సంప్రదించినట్టు మలయాళం మీడియా టాక్. దాదాపు నాలుగేళ్ల తర్వాత నజ్రియా స్క్రీన్‌పై కనిపించనుండటం ఆమె అభిమానులకు ఆనందం కలిగించే విషయం.