
సంగీత దర్శకుడు సుశీన్ శ్యామ్‌తో నజ్రియా
అందమైన మోము, అమాయకపు నటన, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మాలీవుడ్ బ్యూటీ నజ్రియా నజీమ్. నటుడు ఫాహద్ ఫాజిల్‌ను పెళ్లి చేసుకున్నాక సినిమాలకు పూర్తిగా దూరమైన ఆమె.. సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించేందుకు సిద్ధమయ్యారు. ‘బెంగళూర్ డేస్’ డైరెక్టర్ అంజలి మీనన్ డైరెక్షన్‌లో ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నారు. హీరోయిన్‌గా కొనసాగుతూనే ప్రొడ్యూసర్ కొత్త అవతారమెత్తారు. తన భర్త ఫాహద్ హీరోగా నజ్రియా నజీమ్ బ్యానర్‌పై ‘వరదాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే ఈ సినిమాలో నజియా ఓ పాట కూడా పాడారట.
ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘వరదాన్’ సినిమా సంగీత దర్శకుడు సుశిన్ శ్యామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తమ అభిమాన హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు, నిర్మాతగా, సింగర్‌గా తమను అలరించేందుకు సిద్ధమవుతున్నారంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమల్ నీరద్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాహద్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కాగా ఇంతకుముందు ‘సాలా మొబైల్స్’ అనే మలయాళ చిత్రంలో కూడా నజియా ఓ పాటను ఆలపించారు.