ఫహద్ ఫాజిల్.. తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకులకు సుపరిచితుడే! సొంత (మలయాళ) ఇండస్ట్రీలో హీరోగా నటించే ఈయన ఇతర భాషా చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు, విలనిజం పాత్రలు పోషిస్తుంటాడు. ఇటీవల ఈయన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ మూవీ 'ఆవేశం' రూ.100 కోట్ల క్లబ్బులో చేరింది.
సినిమానే జీవితం కాదు
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూస్తున్నంతసేపే తనను పట్టించుకోవాలే తప్ప తర్వాత తన గురించి ఆలోచించొద్దన్నాడు. అలాగే సినిమాయే జీవితం కాదని ఉపదేశించాడు. అతడు ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఏదీ అనుకున్న సమయానికి మొదలుపెట్టను.. పూర్తి చేయను. నేను చేసే సినిమాలు కూడా ముందుగా ప్లాన్ చేసుకున్నవి కాదు. ఎగ్జయిట్‌గా అనిపిస్తే వెంటనే చేసేస్తానంతే! ప్రేక్షకులు సినిమా చూసి ఆనందించేందుకు నా వంతు నేను కృషి చేస్తాను.
నా గురించి ఆలోచించొద్దు
వాళ్లు సినిమా చూస్తున్నంత సేపు ఎంటర్‌టైన్ అవ్వాలి.. అంతేకానీ తర్వాత నేనేం చేస్తున్నాను? నా లైఫ్ ఎలా ఉంది? అని నాగురించి ఆలోచించకూడదు. థియేటర్ లోపల ఉన్నప్పుడు మాత్రమే ఆలోచించండి.. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నన్ను సీరియస్‌గా తీసుకోకండి. ఖాళీ సమయాల్లోనో లేదా తినేటప్పుడో నటీనటుల గురించి వారి పర్ఫామెన్స్ గురించి జనాలు మాట్లాడుకోవడం నాకస్సలు ఇష్టం ఉండదు.
ఇంట్లో ఎందుకు చర్చ?
కావాలంటే సినిమా చూసి ఇంటికి తిరిగెళ్లే సమయంలో దాని గురించి డిస్కషన్ చేయండి.. అంతే కానీ ఇంట్లో కూడా దాని గురించే ఎందుకు చర్చ? సినిమాను కూడా ఓ హద్దులో ఉంచాలి. కేవలం మూవీస్ చూడటమే కాకుండా జీవితంలో చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని గుర్తుంచుకోండి' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహద్.. పుష్ప 2 సినిమాతో పాటు వేటయ్య, మారీషన్ సినిమాలు చేస్తున్నాడు.
చదవండి: మూడో పెళ్లి గురించి ప్రశ్న.. స్టార్ హీరో ఆన్సరిదే..!
Comments
Please login to add a commentAdd a comment