37 టేకులు తీసుకున్నా! | Ramya Krishnan on playing porn star in Super Deluxe | Sakshi
Sakshi News home page

37 టేకులు తీసుకున్నా!

Published Tue, Mar 12 2019 2:47 AM | Last Updated on Tue, Mar 12 2019 2:47 AM

Ramya Krishnan on playing porn star in Super Deluxe - Sakshi

రమ్యకృష్ణ

నటిగా రమ్యకృష్ణ ప్రూవ్డ్‌. విభిన్నమైన పాత్రలు చేశారు. పాజిటివ్, నెగటివ్‌.. ఏ షేడ్స్‌ అయినా స్క్రీన్‌ని షేక్‌ చేశారు. అయితే నటిగా నిరూపించేసుకున్నాం కదా అని రిలాక్స్‌డ్‌గా ఉండటం ఆమెకు నచ్చదు. కొత్త కొత్త చాలెంజ్‌లను స్వీకరిస్తూ తనని తాను మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడుతున్నారు. లేటెస్ట్‌గా తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’ అనే చిత్రంలో నటించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం తమిళంలో భారీ అంచనాలు చుట్టుముట్టిన సినిమా అది. విజయ్‌ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫాహద్‌ పాజిల్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. త్యాగరాజన్‌ కుమారరాజ దర్శకుడు. ఇందులో రమ్యకృష్ణ శృంగార తార పాత్రలో కనిపించారు.

ఈ సినిమాలో పోషించిన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లో నేను చేసిన చాలెంజింగ్‌ పాత్ర ఇది. కొన్ని పాత్రలు డబ్బు కోసం, మరికొన్ని పాపులారిటీ కోసం , పేరుకోసం చేస్తాం. ఈ సినిమా ప్యాషన్‌ కోసం చేశాను. ఓ సన్నివేశాన్ని ఏకంగా 37 సార్లు షూట్‌ చేయాల్సి వచ్చింది. రెండు రోజుల పాటు ఒకే షాట్‌ కోసం 37 టేకులు చేశాం. నా కంటే నా అసిస్టెంట్స్‌ చాలా షాక్‌ అయ్యారు’’ అని పేర్కొన్నారామె. ‘‘37 టేకులే ఎక్కువనుకుంటే ఈ సినిమా కోసం 100, అంతకుమించి టేకులు తీసుకొని షూట్‌ చేసిన సీన్స్‌ కూడా ఉన్నాయి.  రమ్యకృష్ణ ఈ పాత్ర చేస్తారా? చేయరా? అనుకున్నాం. కానీ ఆమె చాలా కూల్‌. తన కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటకు పుష్‌ చేస్తున్నట్టు కష్టపడ్డారామె’’ అని దర్శకుడు త్యాగరాజ కుమారరాజన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement