
Anasuya Bharadwaj remuneration for Pushpa:రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. 'దాక్షాయని' పాత్రలో మంగళం శ్రీను భార్యగా కనిపించింది. అయితే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నిడివి తక్కువగా ఉందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో నటించేందుకు అనసూయ తీసుకున్న పారితోషికంపై ఎంతన్న దానిపై చర్చ మొదలైంది. ఈ సినిమాలో నటించేందుకు ఒక్కరోజుకే అనసూయ రూ. 1-1.5లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. మొత్తంగా పదిరోజులకు పైగానే కాల్షిట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో పుష్ప చిత్రానికి గాను దాదాపు రూ.12 లక్షల వరకు అందుకుందట.
ఇక పుష్ప ఫస్ట్ పార్ట్‌లో అనసూయ రోల్ తక్కువగానే ఉన్నా సెకండ్ పార్ట్‌లో మాత్రం అనసూయ రోల్ కీలకంగా మారనుందని తెలుస్తుంది. ఫాహద్ ఫాజిల్‌తో కలిసి బన్నీపై పగ తీర్చుకునేలా అనసూయ క్యారెక్టర్ ఉండనుందని సమాచారం.