Allu Arjun and Rashmika Mandanna Remuneration for Pushpa Movie
Sakshi News home page

Pushpa Team Remunerations: పుష్పలో బన్నీ, రష్మిక, సుకుమార్‌, సమంతల పారితోషికం ఎంతంటే?

Published Sun, Dec 19 2021 5:28 PM | Last Updated on Wed, Jan 19 2022 3:35 PM

Pushpa Movie Actors Remuneration - Sakshi

Pushpa Movie Cast Remuneration: పాన్‌ ఇండియా చిత్రం పుష్ప విడుదలైన తొలి రోజు(డిసెంబర్‌ 17) నుంచే వసూళ్ల ఊచకోత మొదలుపెట్టింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా తొలి రోజు రూ.71 కోట్లు రాబట్టగా రెండో రోజు రూ.45 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. రెండురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల గ్రాస్‌ సాధించింది. ఈ రోజు సండే కావడంతో ఈ కలెక్షన్లు ఇంకా పుంజుకునే అవకాశం ఉంది.

ఈ రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్న పుష్ప సినిమాకు నటీనటులు, దర్శకుడు సుకుమార్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారనే విషయం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఫిల్మీదునియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. పుష్ప చిత్రం కోసం అల్లు అర్జున్‌ ఏకంగా రూ.50 కోట్ల పారితోషికం అందుకున్నాడట. హీరోయిన్‌ నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా రూ.8 నుంచి రూ.10 కోట్ల మేర డబ్బులు తీసుకుందట.

విలన్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ రూ.3.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడంటున్నారు. దర్శకుడు సుకుమార్‌ పాతిక కోట్లు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ రూ.3.5 కోట్లు, ఐటం సాంగ్‌లో చిందేసిన సమంత రూ.1.5 కోట్లు తీసుకున్నారని భోగట్టా. నెగెటివ్‌ పాత్రను పోషించిన యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఒకరోజు షూటింగ్‌కు రూ.1.5-2 లక్షల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement