'పుష్ప' విలన్‌ వచ్చేశాడు.. భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహద్‌.. లుక్‌ ఇదే | Fahad Fassil First Look From Pushpa Out | Sakshi
Sakshi News home page

Pushpa: 'పుష్ప' విలన్‌ వచ్చేశాడు.. గుండుతో ఫహద్‌.. లుక్‌ అదిరిందిగా

Published Sat, Aug 28 2021 10:46 AM | Last Updated on Sat, Aug 28 2021 12:15 PM

Fahad Fassil First Look From Pushpa Out - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రంపుష్ప’. పాన్‌ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి భాగం ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా  ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, శనివారం ఈ మూవీ నుంచి మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ లుక్‌ విడుదల అయింది. ‘విలన్‌ ఆఫ్‌ పుష్ప’ పేరుతో ఫహద్‌ ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇందులో ఆయన భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ అనే పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.
(చదవండి: ‘కొండపొలం’ ఫస్ట్‌ సాంగ్‌.. ఆకట్టుకున్న వైష్ణవ్‌, రకుల్‌ లవ్‌ ట్రాక్‌)

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుకున్న ఈ సినిమా తొలిభాగాన్ని ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement