మమ్ముట్టి బాటలోనే మరో మలయాళ హీరో | Actor Fahad Fazil Learning Telugu For Allu Arjuns Pushpa | Sakshi
Sakshi News home page

మమ్ముట్టి బాటలోనే మరో మలయాళ హీరో

Published Fri, Jun 11 2021 2:16 PM | Last Updated on Fri, Jun 11 2021 2:30 PM

Actor Fahad Fazil Learning Telugu For Allu Arjuns Pushpa  - Sakshi

పరభాష నటులు తమ పాత్రలకు డబ్బింగ్‌ చెప్పించుకుంటుంటారు. భాషపై పట్టు సాధించాక సొంతంగా డబ్బింగ్‌ చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం మొదటి సినిమాకే ఆయా భాషలపై పట్టు సాధించి ప్రేక్షకులకు తమ గొంతును వినిపించానుకుంటారు మలయాళ హీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ కూడా అలానే చేశారు. తాజాగా వారి బాటలోనే నడవనున్నారట మరో మలయాళ హీరో ఫాహద్‌ ఫాజిల్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు ఫాహద్‌. ఈ సినిమాలో తన సొంత గొంతును వినిపించుకుంటున్నార. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌కు బ్రేక్‌ పడటంతో తెలుగు నేర్చుకునే పనిలో ఉన్నారట. వీలైనంత త్వరగా తెలుగు మీద పట్టు సాధించి పుష్పలో సొంత గొంతు వినిపించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement