టాలీవుడ్‌లో ఒకప్పుడు విలన్ అంటే.. గళ్ళ పంచె, పెద్ద పెద్ద మీసాలు, బుగ్గ మీద ఒకటి రెండు కత్తి గాట్లు, భారీ శరీరంతో గంభీరంగా ఉండేవారు. వారి పాత్రకి అంతగా రెస్పెక్ట్ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పటి విలన్స్ మాత్రం హీరోకి సమానంగా రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ‘సర్’ అని పివాల్సిందేనని పట్టుబడుతున్నారు.
గతేడాది రిలీజైన బ్లాక్ బస్టర్ పుష్పలో ఫస్టాఫ్ మొత్తం ఎదురులేకుండా ఎదుగుతూ వెళ్తుంటాడు పుష్పరాజ్.కానీ విలన్ భన్వర్ సింగ్ షేకావత్(ఫహద్ ఫాజిల్) ఎంట్రీ ఇచ్చిన తర్వాత పుష్ప స్పీడ్ తగ్గతుంది.
పుష్పకు, భన్వర్ కు మధ్య కేవలం ‘సర్’ అనే పాయింట్ పైనే అసలు వైరం మొదలవుతుంది. ఒక్కటి తగ్గుతోంది పుష్పా అంటూ భన్వర్.. ఇది సర్ నా బ్రాండ్ అంటూ పుష్ప చెప్పే డైలాగ్స్.. వీరిద్దరి వైరాన్ని సీక్వెల్ వరకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా భన్వర్ సింగ్ షెకావత్ తనని సర్ అని పిలవాల్సిందే అని పట్టుబట్టే సీన్,ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది.
ఒక ఇటీవల విడుదలై సూపర్ సక్సెస్‌తో దూసుకెళ్తున్న కమల్ హాసన్ ‘విక్రమ్’లో విలన్‌ది కూడా సేమ్ ప్రాబ్లమ్. ఈ చిత్రం క్లైమాక్స్‌లో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు తమిళ స్టార్ హీరో సూర్య. రోలెక్స్ క్యారెక్టర్ లో సూర్య విలనీజం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెంటింగ్ టాపిక్.పుష్ప మాదిరే విక్రమ్‌లో కూడా విలన్ రెస్పెక్ట్ కోరుకున్నాడు.తన మనుషులే తనని పేరు పెట్టి పిలవడం జీర్ణించుకోలేకపోతాడు.రోలెక్స్ సర్ అని పిలవాల్సిందే అని పట్టుబడతాడు.ఈ సీన్ కూడా సినిమాకే హైలైట్ గా నిలిచింది. మొత్తంగా విలన్ గా మారుతున్న హీరోలు కొత్త కండీషన్ పెడుతున్నారు. హీరోల చేతిలో తన్నులు తిన్నా సరే రెస్పెక్ట్ మాత్రం తగ్గేదేలేదంటున్నారు.సర్ అని పిలవకపోతే సీక్వెల్ వరకు ఆ వైరం కొనసాగుతుందని చెప్పుకొస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment