
జస్ట్... ఈ పాట ఒక్కటే తక్కువ. అక్కడ ఎవరైనా పాడితే మాత్రం... మమతా మోహన్‌దాస్ సిచ్యువేషన్‌కి సరిగ్గా సూటవుతుంది! ఇప్పుడు వాగులు–వంకలు... కొండలు–కోనలు... వెంట మమతా మోహన్‌దాస్ ప్రయాణం సాగుతోంది. ఎందుకంటే... మాతృభాష మలయాళంలో ‘కార్బన్’ అనే సినిమాలో నటిస్తున్నారీ బ్యూటీ. ఇందులో ఫాహద్ ఫాజిల్ హీరో. ఫారెస్ట్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ కోసం కేరళలోని అడవులన్నిటినీ చుట్టేస్తోంది చిత్రబృందం. ‘గీతాంజలి’లో ‘నందికోండ వాగుల్లో...’ పాటది హారర్ కాన్సెప్ట్.
‘కార్బన్’ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో గానీ... షూటింగులో హీరోయిన్ కంపల్సరీగా ఉండాలి కదా! అఫ్‌కోర్స్... యూనిట్ మెంబర్స్ నీడలా మమత వెంటే నడుస్తూ జాగ్రత్తగా చూసుకుంటారనుకోండి. ఎంతైనా... అడవుల్లో అడుగులేయడమంటే ఎంతోకొంత భయం ఉంటుంది కదా! తెలుగులో ఎన్టీఆర్ ‘యమదొంగ’, వెంకటేశ్ ‘చింతకాయల రవి’, నాగార్జున ‘కింగ్’ తదితర చిత్రాల్లో నటించిన మమతా మోహన్‌దాస్, క్యాన్సర్‌ను జయించిన తర్వాత ఎక్కువగా మలయాళ సినిమాలే చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment