నా కోసం.. నా కుటుంబం.. అని ఆలోచనలో చేసే మనుషులు ఉన్న ఈ కాలంలో.. మన కోసం.. మన ఊరి కోసం.. రేపటి తరాల కోసం మంచి వాతావరణాన్ని అందించాలని ప్రతినబూనింది ఇక్కడో ఊరు. ఈ క్రమంలో ఆకట్టుకునే ప్రయత్నాలతో ముందుకు పోతోంది.
రాజపాళ్యం.. తమిళనాడులో పశ్చిమ కనుమల్లో ఉండే ఓ పట్టణం. ఇక్కడ జనాభా రెండు లక్షలకు పైనే. మామిడి పండ్లకు, మరీ ముఖ్యంగా నాటు కుక్కలకు ఫేమస్ ఈ ప్రాంతం. అయితే ఈ మధ్య ‘2040 మిషన్’తో ఈ ప్రాంతం వార్తల్లోకి ఎక్కింది. అప్పటికల్లా కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి(zero carbon city) తీసుకొచ్చే వ్యూహాలు అమలు చేస్తోంది.
కార్బన్ న్యూట్రల్ బై 2040 కార్యక్రమం కోసం అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు సత్పలితాలను ఇస్తున్నాయి. అక్కడి జనాలు సోలార్ ఎనర్జీకి క్రమక్రమంగా అలవాటు పడుతున్నారు. పవన్ విద్యుత్‌కు పెద్ద పీట వేసే ప్రయత్నాల్లో అక్కడి అధికార యంత్రాంగం ఇప్పటికే తలమునకలైంది. పునరుత్పాదక విద్యుత్ కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలని, అలాగే సీఎన్‌జీ బయో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
2021లో రాజపాళ్యం నుంచి 7 లక్షల టన్నుల కర్భన ఉద్గారాలు వెలువడ్డాయి. వాటిని జీరోకి తేవాలన్నదే మిషన్ 2040 ఉద్దేశం.
పర్యావరణ ప్రయోజనాలు
- కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి
- గాలి నాణ్యత పెరుగుతుంది
- పచ్చదనం విస్తరిస్తుంది
- జల వనరులు సంరక్షణ
ఆర్థిక ప్రయోజనాలు
- పునరుత్పాదకతో.. ఖర్చులు తగ్గుతాయి
- ఉపాధి కల్పన, ఉద్యోగాలు దొరుకుతాయి
Rajapalayam leads small town India 🇮🇳 towards green future.
The beautiful city of Rajapalayam in Tamil Nadu has developed a masterplan for a zero carbon city. It will inspire cities across India and the globe.
Rajapalayam (200 000 inhabitants) plans to source enegy from solar,… pic.twitter.com/7yujcIimP5— Erik Solheim (@ErikSolheim) January 6, 2025
సామాజిక లాభాలు
- ప్రజారోగ్యం
- ఆయుష్షు పెరిగే అవకాశం
- కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్
అలాగే.. ప్రయాణాల కోసం సంప్రదాయ ఇంధనవనరుల మీద కాకుండా ఈ-బస్సులు, ఈ-వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు.. మొక్కల పెంపకంతో పాటు జలవనరులు కాలుష్యం బారినపడకుండా పరిరక్షించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆఖరికి.. పండుగలకు, ఇతర కార్యాక్రమాలకు ప్లాస్టిక్‌ను దూరంగా ఉంచుతూ వస్తున్నారు.
కేవలం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల కోసం పచ్చటి ప్రకృతిని అందిద్దాం అనే నినాదానికి అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆధునీకరణలో భాగంగా తమ ఊరు ఏ ఢిల్లీ, ముంబైలాగో కాలుష్య నగరంగా మారాలని అక్కడి ప్రజలు ఆశించడం లేదు. రాజపాళ్యంలా ఉండి.. కాలుష్యరహిత ప్రాంతంగా దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నారు.
సవాళ్లు
- కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం
- సాంకేతికంగా అవరోధాలు ఎదురయ్యే అవకాశం
- పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు మరికొంత సమయం
- పారిశ్రామిక సహకారం
- పాటించడమే కాదు.. పర్యవేక్షణ కూడా సవాల్‌తో కూడున్నదే. కానీ, పచ్చటి భవిష్యత్తుతో దక్కే ఫలితం మాత్రం దీర్ఘకాలికమైంది.
Comments
Please login to add a commentAdd a comment