ఓటీటీలో ఫహాద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్‌ సినిమా | Fahadh Faasil Bougainvillea Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

Bougainvillea OTT Release: ఓటీటీలో ఫహాద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్‌ సినిమా

Published Tue, Dec 10 2024 9:56 AM | Last Updated on Tue, Dec 10 2024 10:41 AM

Bougainvillea Fahadh Faasil Movie OTT Streaming Date Locked

మలయాళ ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన  సైకలాజికల్ థ్రిల్లర్‌ 'బౌగెన్‌విల్లా' ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు ఇప్పటికే ప్రకటన వచ్చింది. అయితే, తాజాగా ఈ చిత్రం నుంచి తెలుగు ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలలో మెప్పించారు పోషిస్తున్నారు.  అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్‌ తెచ్చుకున్న ఈ హిట్‌ మూవీ ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది.

'బౌగెన్‌విల్లా' చిత్రంలో  ఫహాద్ ఫాజిల్, కుంచకో బొబన్, జోతిర్మయి వంటి స్టార్స్‌ నటించడంతో మలయాళంలో మంచి ‍క్రేజ్‌ తెచ్చుకుంది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది. సోనీలివ్‌ ఓటీటీ వేదికగా డిసెంబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈమేకు తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.

సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను అమల్ నీరద్ అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడని ప్రశంసలు అందాయి. సుమారు రూ. 20 కోట్లతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ. 40 కోట్లకు పైగానే రాబట్టింది. కేరళలో ఎవరూ ఊహించని విధంగా అక్కడి టూరిస్టులు మిసింగ్‌ అవుతూ ఉంటారు. ఆ కేసులో దాగి ఉన్న సీక్రెట్‌ను ఏసీబీ డేవిడ్ కోషిగా ఫాహద్‌ మెప్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement