Pushpa The Rise: Allu Arjun and Fahadh Faasil Shoot Face-off Scenes - Sakshi
Sakshi News home page

Pushpa: మరోసారి రిలీజ్‌ డేట్‌ను కన్‌ ఫర్మ్‌ చేసిన 'పుష్ప' టీం

Published Mon, Oct 4 2021 5:35 PM | Last Updated on Mon, Oct 4 2021 7:00 PM

Pushpa: Face off Scenes Between Pushpa Raj and Bhanwar Singh Shekhawat - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో పాన్‌ ఇండియా లెవల్‌ తీస్తున్నారు మేకర్స్‌. ఈ  సినిమాలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

పుష్పరాజ్‌(అ‍ల్లు అర్జున్‌)- భన్వర్‌ సింగ్‌ షెకావత్‌(ఫహద్‌ ఫాజిల్‌)మధ్య వచ్చే ఫైట్‌ సీన్స్‌ అదిరిపోతాయని పేర్కొంది. ఇక ఈ చిత్రాన్ని  డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు మరోసారి స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను షేర్‌చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ  ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement