థియేటర్లలో 50 శాతం సీటింగ్‌కే అనుమతిచ్చిన కేంద్రం ఈసారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో నడుపుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్లు కళకళలాడే రోజులు త్వరలోనే సాక్షాత్కరించబోతున్నాయి. ఈ క్రమంలో స్పీడు పెంచిన టాలీవుడ్‌లో స్టార్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ 'గని' జూలై 30న బాక్సర్‌గా రింగులోకి దిగుతున్నానని వెల్లడించగా తాజాగా అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. స్వాతంత్య్ర దినోత్సవానికి రెండు రోజుల ముందుగా అంటే ఆగస్టు 13న థియేటర్లలో 'పుష్ప'గా వేట మొదలు పెట్టనున్నాడు. (చదవండి: ‘ఆచార్య’కి నో.. అల్లు అర్జున్ చెల్లిగా ఓకే)
హిట్ సినిమాలు ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే పుష్ప. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్ అనే స్మగ్లర్‌గా మాస్ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగుతుంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథ. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. (చదవండి: శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు)
#PUSHPA loading in theatres from 13th August 2021. Excited to meet you all in cinemas this year.Hoping to create the same magic one more time with dearest @aryasukku & @ThisIsDSP .@iamRashmika @MythriOfficial #PushpaOnAug13 pic.twitter.com/tH3E6OpVeo
— Allu Arjun (@alluarjun) January 28, 2021
Comments
Please login to add a commentAdd a comment