
కరోనా టైంలో తెలుగు చిత్రపరిశ్రమలో వరుస విషాదాలు సంభవిస్తున్నాయి. సింగర్ ఆనంద్, స్టిల్ ఫొటోగ్రాఫర్ మోహన్‌జీ, రచయిత నంద్యాల రవి, ప్రముఖ ఇంటర్వ్యూ జర్నలిస్ట్.. నటుడు టీఎన్ఆర్, పీఆర్వో బీఏ రాజులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఉదయం మరో విషాదం చోటుచేసుకుంది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ అన్నంరెడ్డి కృష్ణకుమార్ ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో కన్నుమూశారు. విశాఖపట్టణంలో ఈ ఉదయం ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. కృష్ణకుమార్ తెలుగులో ప్రొడ్యూసింగ్ వహించిన ‘అనుకోని అతిథి’ సినిమా మరో రెండు రోజుల్లో ‘ఆహా’లో రిలీజ్ కావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మృతి చెందడం ఆయన సన్నిహితుల్ని విషాదంలోకి నెట్టింది. కాగా, కృష్ణకుమార్ మృతి విషయం తెలిసిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు.
ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి లీడ్ రోల్‌లో వివేక్ డైరెక్ట్ చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘అథిరన్’. మలయాళంలో హిట్ అయిన ఈ మూవీ ‘అనుకోని అతిథి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ వెర్షన్‌కి నిర్మాతల్లో అన్నంరెడ్డి కృష్ణ కుమార్ ఒకరు. గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు గమనించే లోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం.కాగా, మూవీ స్ట్రీమింగ్కు సరిగ్గా రెండు రోజుల ముందు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment