తెలుగు సినీ నిర్మాత విజయ్ జాగర్లమూడి గుండెపోటుకు గురయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడిపై ఈ నిర్మాత సినిమా తీశారు. అయితే అటు సినిమాను విడుదల చేయలేక, ఇటు ఆర్థిక భారాన్ని తట్టుకోలేక సతమతమవుతున్నాడు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం చిన్న వయసులోనే ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి ఖుదీరామ్ బోస్. బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో ‘ఖుదీరామ్ బోస్’ పాన్ ఇండియా మూవీగా రూపొందింది. గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ప్రశంసలే కానీ రిలీజ్‌కు నోచుకోలే
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. 2022 డిసెంబర్ 22న ‘ఖుదీరామ్ బోస్’ చిత్రాన్ని గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులకు ప్రదర్శించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తీసిన సినిమా విడుదలకు నోచుకోక, ఆర్థిక సమస్యల ఒత్తిడితో నిర్మాత గుండెపోటుకు గురయ్యారు.
ఎందరో ఉద్ధండులు పని చేశారు
చిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేశారు. సంగీత దర్శకుడిగా మణిశర్మ, ప్రొడక్షన్ డిజైనర్‌గా నేషనల్ అవార్డ్ విన్నర్ తోట తరణి, స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కన్నన్, సినిమాటోగ్రాఫర్‌గా రసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె.వెంకటేష్ వర్క్ చేశారు. ఖుదిరామ్ బోస్ గురించి ఈ జనరేషన్‌కు తెలియకపోవటం, కమర్షియల్ సినిమాల మధ్య ఇలాంటి బయోపిక్ సినిమాలకు పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి ఆదరణ లేకపోవడమే నిర్మాత ఇటువంటి దుస్థితికి రావడానికి కారణంగా కనిపిస్తోంది.
చదవండి: జైలర్‌లో విలన్‌గా మెగాస్టార్ చేయాల్సింది, కానీ రజనీకాంత్ వద్దన్నాడట!
Comments
Please login to add a commentAdd a comment