పుష్ప నటుడి థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ చూశారా? | Fahadh Faasil promise an intense thriller Bougainvillea trailer | Sakshi
Sakshi News home page

Fahadh Faasil: ఫాహద్ ఫాజిల్ సైకలాజికల్ థ్రిల్లర్‌ .. ట్రైలర్ రిలీజ్!

Published Fri, Oct 11 2024 7:49 PM | Last Updated on Fri, Oct 11 2024 8:20 PM

Fahadh Faasil promise an intense thriller Bougainvillea trailer

పుష్ప నటుడు ఫాహద్ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్‌ బౌగెన్‌విల్లా. ఈ సినిమాకు అమల్ నీరద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కుంచాకో బోబన్, జ్యోతిర్మయి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

కాగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పుష్ప మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అల్లు అర్జున్‌- సుకుమార్‌ కాంబోలో వచ్చిన ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. పుష్ప సీక్వెల్ పార్ట్-2 లోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement