'కేజీఎఫ్', 'కాంతార' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించి, వందల కోట్ల లాభాలు అర్జించిన హోంబలే ఫిల్మ్స్ కు షాక్ తగిలింది. అది కూడా ఓ చిన్న మూవీ వల్ల. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఎందుకంటే మరో మూడు నెలల్లో 'సలార్' రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో తాము నిర్మించిన ఓ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం అవాక్కయ్యేలా చేసింది.
ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన‍్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో పోలీస్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఈ మధ్యే 'ధూమం' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు.
(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి)
కన్నడలో లూసియా, యూటర్న్ లాంటి డిఫరెంట్ చిత్రాలతో హిట్స్ కొట్టిన పవన్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా జనాల్ని పెద్దగా ఎంటర్‌టైన్ చేయలేకపోతోంది. రెండు రోజుల్లో రూ.2.5 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు టాక్. స్టోరీ పరంగానూ పొరపాట్లు జరగడంతో బాక్సాఫీస్ దగ్గర ఫ‍్లాప్ టాక్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రూ.8 కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టినప్పటికీ.. నెగిటివ్ టాక్ రావడం నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ని అయోమయానికి గురిచేసింది.
'ధూమం' కథేంటి?
సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస‍్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ.
(ఇదీ చదవండి: మహేశ్ సినిమా క్లైమాక్స్ బయటపెట్టిన రాజమౌళి తండ్రి)
Comments
Please login to add a commentAdd a comment