
మలయాళ నటునితో మణిరత్నం సినిమా?
రావణ, కడలి... ఇలా ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో తన తాజా చిత్రం విషయంలో
రావణ, కడలి... ఇలా ఇటీవల మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రాలు ఆశించిన ఫలితం సాధించలేదు. దాంతో తన తాజా చిత్రం విషయంలో మణిరత్నం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారట. గత కొన్ని నెలలుగా ఆయన కథ తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. మామూలుగా మణిరత్నం ఈ మధ్య ఏ సినిమా చేసినా బహు భాషల్లో చేస్తున్నారు. తాజా చిత్రం కూడా ఆ కోవకే చెందుతుందని సమాచారం. ఈ చిత్రం గురించి ఏ విశేషాలూ ఇంకా బయటికి రాలేదు. అయితే, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ని ఓ లీడ్ రోల్‌కి ఎంపిక చేశారట. మలయాళ తారలతో మణిరత్నం సినిమా చేయడం ఇది కొత్త కాదు. మమ్ముట్టి, మోహన్‌లాల్, పృధ్వీరాజ్‌తో ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడా జాబితాలో తను చేరినందుకు ఫాహద్ ఆనందంగా ఉన్నారట.