షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో! | Pushpa new poster release on Fahadh Faasil birthday | Sakshi
Sakshi News home page

Fahadh Faasil Pushpa 2: షెకావత్ సర్ న్యూ లుక్.. 'పుష్ప'పై ప్రతీకారంతో!

Published Wed, Aug 9 2023 12:22 AM | Last Updated on Wed, Aug 9 2023 8:43 AM

Pushpa new poster release on Fahadh Faasil birthday - Sakshi

పుష్పరాజ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు బన్వర్‌సింగ్‌ షెకావత్‌. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’లో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్,పోలీసాఫీసర్‌ భన్వర్‌సింగ్‌ షెకావత్‌పాత్రలో ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలోని మలి భాగం ‘పుష్ప: ది రూల్‌’ సెట్స్‌పై ఉంది. ఇందులో కూడా అల్లు అర్జున్, ఫాహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లోపాల్గొన్నారు ఫాహద్‌ ఫాజిల్‌. కాగా ఆగస్టు 8 (మంగళవారం) ఫాహద్‌ ఫాజిల్‌ బర్త్‌ డే.

ఈ సందర్భంగా ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలోని ఫాహద్‌ కొత్తపోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘ప్రతీకారంతో  భన్వర్‌సింగ్‌ షెకావత్‌ సార్‌ బిగ్‌ స్క్రీన్స్‌పై వచ్చేందుకు రెడీ అవుతున్నారు’ అనే క్యాప్షన్‌తో చిత్ర యూనిట్‌ ఫాహద్‌ కొత్తపోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 10న హైదరాబాద్‌లోప్రారంభం కానుందని, హీరో అల్లు అర్జున్, హీరోయిన్‌ రష్మికా మందన్నా షూటింగ్‌లోపాల్గొంటారని తెలిసింది. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో విడుదల కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement