ట్రెండింగ్‌లో బాలయ్య... 20 ఏళ్ల రూల్‌కి బ్రేక్‌! | Nandamuri Balakrishna Will Do Telugu Remake Of Fahadh Faasil Aavesham | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో బాలయ్య... 20 ఏళ్ల రూల్‌కి బ్రేక్‌ ఇచ్చేనా?

Published Tue, Aug 6 2024 5:04 PM | Last Updated on Tue, Aug 6 2024 5:31 PM

Nandamuri Balakrishna Will Do Telugu Remake Of Fahadh Faasil Aavesham

ఆవేశం సినిమా తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌ వర్గాలు.  ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ఈ బ్లాక్‌ బస్టర్‌ మూవీ రీమేక్‌ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ సొంతం చేసుకుంది.  బాలయ్య కోసమే ఆ హక్కులను కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయబోతున్నాడట. 

వాస్తవానికి బాలయ్య రీమేకులకు దూరంగా ఉంటాడు. దాదాపు 20 ఏళ్ల కింద తమిళ బ్లాక్‌ బస్టర్‌ ‘సామి’ తెలుగు రీమేక్‌ ‘లక్ష్మీనరసింహా’లో బాలయ్య హీరోగా నటించాడు. ఆ తర్వాత కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీమేక్‌ చేయాలని బాలయ్య డిసైడ్‌ అయ్యాడట. ఆవేశం సినిమా బాగా నచ్చడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో ఫహద్‌ ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ చేశాడు.  సినిమా విజయానికి ప్రధాన కారణం ఆయన నటనే. రిలీజ్‌ తర్వాత ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందులో పహద్‌ని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని చెప్పారు. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం థియేటర్స్‌లో మాత్రమే కాదు..ఓటీటీ(అమెజాన్‌ ప్రైమ్‌)లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది.  

అలాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమా రీమేక్‌లో బాలయ్య నటిస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన పేరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆవేశం సినిమా పాటకి బాలయ్య విజువల్స్‌ జోడించి.. ఆ వీడియోని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.  మరి ఇదే కనుక నిజమైతే.. బాలయ్య తన 20 ఏళ్ల రూల్‌కి బ్రేక్‌ ఇచ్చినట్లే అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement