Aavesham Movie
-
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
మళ్ళీ రీమేక్ వైపు చూస్తోన్న రవితేజ..
-
ట్రెండింగ్‌లో బాలయ్య... 20 ఏళ్ల రూల్కి బ్రేక్!
ఆవేశం సినిమా తెలుగు రీమేక్‌లో బాలకృష్ణ నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఫహద్ ఫాజిల్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. బాలయ్య కోసమే ఆ హక్కులను కొలుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కొన్ని మార్పులు చేసి ఓ ప్రముఖ దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడట. వాస్తవానికి బాలయ్య రీమేకులకు దూరంగా ఉంటాడు. దాదాపు 20 ఏళ్ల కింద తమిళ బ్లాక్ బస్టర్ ‘సామి’ తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’లో బాలయ్య హీరోగా నటించాడు. ఆ తర్వాత కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడట. ఆవేశం సినిమా బాగా నచ్చడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతుంది.ఈ చిత్రంలో ఫహద్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. సినిమా విజయానికి ప్రధాన కారణం ఆయన నటనే. రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కరు ఆ పాత్ర గురించే మాట్లాడుకున్నారు. అందులో పహద్ని తప్ప మరో హీరోని ఊహించుకోలేమని చెప్పారు. రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందంటే.. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. కేవలం థియేటర్స్‌లో మాత్రమే కాదు..ఓటీటీ(అమెజాన్ ప్రైమ్)లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్‌లో బాలయ్య నటిస్తున్నారని ప్రచారం జరగడంతో ఆయన పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కొంతమంది అభిమానులైతే ఏకంగా ఆవేశం సినిమా పాటకి బాలయ్య విజువల్స్ జోడించి.. ఆ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి ఇదే కనుక నిజమైతే.. బాలయ్య తన 20 ఏళ్ల రూల్కి బ్రేక్ ఇచ్చినట్లే అవుతుంది. -
ఆ మ్యూజిక్ డైరెక్టర్‌పై సమంత ప్రశంసలు
ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ తరం హీరోయిన్లకు బాగా తెలుసు. ఇందుకు నటి సమంత అతీతం కాదు. ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ తరువాత మరో చిత్రంలో నటించలేదు. అలాగని తెరమరుగు కాలేదు. తన గ్లామరస్ ఫొటోలతో, ఫిట్నెస్ ఫొటోలతోనో, ఇతరుల గురించి కామెంట్స్ చేయడంతోనో తరచూ వార్తల్లో ఉంటారు. మరో పక్క ఈమె నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో హల్చల్ చేస్తుంటాయి. ఒక పక్క మయోసైటీస్ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూనే ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్న జాన సమంత. కాగా ఈమె నటించిన ది ఫ్యామిలీ స్టోరీ– 2 వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. కాగా సమంత ఓ మలయాళ సంగీత దర్శకుడిని మేధావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇటీవల విజయాలతో కళ కళలాడుతోంది. తక్కువ బడ్జెట్‌తో చిత్రాలు చేసి భారీ లాభాలను చవి సూస్తున్నారు. అలా ఇటీవల బ్రహ్మయుగం,ప్రేమలు, మంజుమల్ బాయ్స్, ది గోట్ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ కోవలోకి ఆవేశం చిత్రం చేరింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహత్ ఫాజిల్ తాజాగా కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ఆవేశం. ఈనెల 11న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్టు వసూలు చేసిందని సమాచారం. కాగా ఈ చిత్రానికి నటి సమంత తన ఇన్‌స్ట్రాగామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా ఆ చిత్ర సంగీత దర్వకుడు సుషిన్ శ్యామ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది.