ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌పై సమంత ప్రశంసలు | Samantha raves about Fahadh Faasil Aavesham | Sakshi
Sakshi News home page

ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌పై సమంత ప్రశంసలు

Published Tue, Apr 23 2024 1:02 PM | Last Updated on Tue, Apr 23 2024 1:07 PM

Samantha raves about Fahadh Faasil Aavesham - Sakshi

ఎప్పుడూ వార్తల్లో ఉండటం ఈ తరం హీరోయిన్లకు బాగా తెలుసు. ఇందుకు నటి సమంత అతీతం కాదు. ఈమె నటించిన చివరి చిత్రం ఖుషీ విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ తరువాత మరో చిత్రంలో నటించలేదు. అలాగని తెరమరుగు కాలేదు. తన గ్లామరస్‌ ఫొటోలతో, ఫిట్‌నెస్‌ ఫొటోలతోనో, ఇతరుల గురించి కామెంట్స్‌ చేయడంతోనో తరచూ వార్తల్లో ఉంటారు. మరో పక్క ఈమె నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానళ్లలో హల్‌చల్‌ చేస్తుంటాయి.

ఒక పక్క మయోసైటీస్‌ వ్యాధి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తూనే ప్రేక్షకులకు దూరం కాకుండా జాగ్రత్త వహిస్తున్న జాన సమంత. కాగా ఈమె నటించిన ది ఫ్యామిలీ స్టోరీ– 2 వెబ్‌ సిరీస్‌ త్వరలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. కాగా సమంత ఓ మలయాళ సంగీత దర్శకుడిని మేధావి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఈ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

మాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ఇటీవల విజయాలతో కళ కళలాడుతోంది. తక్కువ బడ్జెట్‌తో చిత్రాలు చేసి భారీ లాభాలను చవి సూస్తున్నారు. అలా ఇటీవల బ్రహ్మయుగం,ప్రేమలు, మంజుమల్‌ బాయ్స్‌, ది గోట్‌ వంటి చిత్రాలు సంచలన విజయాన్ని సాధించాయి. తాజాగా ఈ కోవలోకి ఆవేశం చిత్రం చేరింది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహత్‌ ఫాజిల్‌ తాజాగా కథానాయకుడిగా నటించిన మలయాళ చిత్రం ఆవేశం.

ఈనెల 11న విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్టు వసూలు చేసిందని సమాచారం. కాగా ఈ చిత్రానికి నటి సమంత తన ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అందులో ముఖ్యంగా ఆ చిత్ర సంగీత దర్వకుడు సుషిన్‌ శ్యామ్‌పై పొగడ్తల వర్షం కురిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement