ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన‍్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్ ఫాజిల్ నటించిన 'ధూమమ్' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
(ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్.. ఆయన బహుమతే కదా అంటూ..)
'కేజీఎఫ్, కాంతార,సలార్' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్‌లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం.
(ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!)
'ధూమం' కథేంటి?
సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస‍్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment