
తమ వివాహబంధానికి పరోక్షంగా సహాయపడిన నిత్యామీనన్‌కు నటి నజ్రియా కృతజ్ఞతలు తెలిపారు. రాజా రాణి, నైయ్యాండి వంటి చురుకైన పాత్రల్లో నటించి తమిళ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన నజ్రియా కెరీర్ శిఖరాగ్రాన ఉన్న సమయంలోనే నటుడు ఫహద్ ఫాజిల్‌ను వివాహమాడి సెటిలయ్యారు.
వీరి ప్రేమ కలిసి రావడంతో చిత్రాలను తనకు వదిలిపెట్టిన విషయాన్ని నిత్యామీనన్ ప్రస్తుతం వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ ‘బెంగళూరు డేస్’మలయాళ చిత్రంలో తనను కథానాయకిగా నటించేందుకు అడిగారన్నారు. వేరే చిత్రాల్లో బిజీగా ఉండడంతో ఆ చిత్రాన్ని అంగీకరించలేకపోయానన్నారు.
ఆ అవకాశం నజ్రియాకు దక్కిందని, ఫహద్ ఫాజిల్ హీరోగా నటించినట్లు తెలిపారు. ఆ సమయంలోనే నజ్రియాకు ఫహద్‌కు మధ్య ప్రేమ చిగురించిందన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టడంతో వారి వివాహబంధానికి దారితీసినట్లు గొప్పగా చెబుతుంటారని తెలిపారు.