పుష్ప: హీరోకు ధీటుగా విలన్‌కు పారితోషికం | Shocking Remuneration To Pushpa Villain Fahadh Faasil | Sakshi
Sakshi News home page

పుష్ప: హీరోకు ధీటుగా విలన్‌కు పారితోషికం

Published Mon, Mar 22 2021 4:20 PM | Last Updated on Mon, Mar 22 2021 5:08 PM

Shocking Remuneration To Pushpa Villain Fahadh Faasil - Sakshi

ఫాహద్‌ ఫాజిల్‌

దక్షిణాది చిత్ర పరిశ్రమలో పారితోషకం అధికంగా ఇచ్చేది టాలీవుడ్‌లోనే. అందుకే ఇతర భాషల్లో హీరోలుగా చేసే నటులు సైతం మన దగ్గర విలన్‌.. కీలక క్యారెక్టర్‌లు చేసేందుకు అంగీకరిస్తారు. ఆయా పాత్రలకు గాను వారు భారీ పారితోషికం తీసుకుంటారు. కథలో పాత్ర డిమాండ్‌ను బట్టి మన దర్శక, నిర్మాతలు కూడా భారీ పారితోషికాలకు సై అంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పుష్ప మూవీలో ఓ క్యారెక్టర్‌కి భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం. 

జాతీయ అవార్డు గ్రహీత, మలయాళీ స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’లో విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఫాజిల్‌కు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు(జీఎస్‌టీ అదనం) పారితోషికంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మన దగ్గర చిన్న హీరోలు సైతం ఈ రేంజ్‌లో పారితోషికం డిమాండ్‌ చేయడం లేదు. అలాంటిది విలన్‌ పాత్ర చేసే ఫాజిల్‌కు ఇన్ని కోట్లు ఇవ్వడం టూమచ్‌ అని కొందరు అంటుండగా.. మరి కొందరు మాత్రం అతడి రేంజ్‌కు ఇది తక్కువే అనడం కొసమెరుపు. గతంలో ఫాజిల్‌ పలు అవార్డులు దక్కించుకున్నాడు. మళయాలంలో అతడికి ఎంతో క్రేజ్‌. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే పుష్ప మేకర్స్‌ ఇంత భారీ పారితోషికం ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం.  

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, రవి శంకర్‌.వై నిర్మిస్తున్నారు. ప్యాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆగస్టు 13న విడుదల చేయనున్నారు.

చదవండి: 
పుష్పరాజ్‌ను ఢీకొట్టే ధీటైన విలన్ దొరికాడు

పుష్ప కోసం నల్లబడటానికి రెండు గంటలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement