మెగా పవర్ స్టార్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ఓ మూవీ పాన్ ఇండియా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పై రానుంది. ఈ మూవీ చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఖారరైన సంగతి తెలిసిందే. అయితే పాపులర్ క్యాస్ట్ అండ్ క్రూతో ఈ మూవీ రూపొందిస్తున్నాడు దర్శకుడు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికలో చిత్ర బృందం బిజీగా ఉంది. ఈ క్రమంలో కొంతమంది స్టార్ నటీనటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.
తాజాగా ఈ మూవీలో విలన్ కోసం మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్‌ను శంకర్ టీం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శంకర్ సినిమాలో హీరోకు బలమైన పోటీగా ప్రతినాయకుడు పాత్ర ఉంటుంది. ఈ మూవీలో కూడా బలమైన క్యారెక్టరైషన్‌తో విలన్ పాత్ర ఉండబోతుందట. అందుకోసమే చరణ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతి నాయకుడిగా ఫహద్ అయితే బాగుంటుందని శంకర్ భావించారట. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఫహద్ ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’ మూవీతో పాటు మలయాళం, తమిళంలో పలు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శంకర్ మూవీ ఆఫర్ రావడంతో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు అతడు ధైర్యం చేయడం లేదట. అందుకే కాస్తా టైం అడిగి తన డేటు సర్దుబాటు చేసుకుని చెప్తానని చెప్పినట్లు సమాచారం. అదంతా ఒకే అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువనుందట. కాగా ఇటీవల ఫహాద్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ పుష్పలోని ఆయన ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఇందులో ‘చెడు చూడటానికి ఎప్పుడూ ప్రమాదకరంగా కనిపించదు. హ్యాపీబర్త్‌డే ఫహద్ ఫాజిల్’ అని కేవలం ఫహద్ కన్ను చిత్రాన్ని మాత్రమే పోస్టర్‌పై ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment