'Pushpa 2' Latest Update: A key schedule completed with Fahadh Faasil - Sakshi
Sakshi News home page

Pushpa 2 : పుష్ప 2పై అదిరిపోయే అప్‌డేట్‌.. ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదట! 

Published Fri, May 19 2023 7:54 AM | Last Updated on Fri, May 19 2023 9:24 AM

Pushpa 2 Latest Update - Sakshi

‘పోలీసాఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహద్‌ ఫాజిల్‌) ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధం అయ్యారు.. ఈసారి ఆయన ప్రతీకారం మామూలుగా ఉండదు’ అంటూ ‘పుష్ప–2 ది రూల్‌’ యూనిట్‌ పేర్కొంది. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’ తొలి భాగం 2021 డిసెంబరు 17న విడుదలై పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్‌గా నిలిచింది.

(చదవండి: మరోసారి విలన్‌గా ఎన్టీఆర్‌.. ఏ సినిమాలో అంటే.. )

ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప–2 ది రూల్‌’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. కాగా ‘పుష్ప: ది రైజ్‌’లో మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ పోషించిన పోలీసాఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్ర ప్రేక్షకుల్ని అలరించింది. ‘

పుష్ప–2 ది రూల్‌’లోనూ ఆయన పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఫాహద్‌ ఫాజిల్‌పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు సుకుమార్‌. ఆ షెడ్యూల్‌ పూర్తవడంతో సుకుమార్, ఫాహద్‌ ఫాజిల్‌ సెట్‌లో ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement