ఓటీటీకి వచ్చేసిన పుష్ప విలన్‌ హిట్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Fahad Fazil Movie Avesham Streaming Released In OTT Goes Viral, Check Streaming Platform Details | Sakshi

Avesham Movie In OTT: ఓటీటీలో పుష్ప విలన్‌ సూపర్‌ హిట్‌ మూవీ.. ఆ విషయంలో రికార్డ్!

May 9 2024 9:20 AM | Updated on May 9 2024 9:54 AM

Fahad Fazil Movie Avesham Streaming On This OTT Goes Viral

మలయాళ స్టార్ నటుడు, పుష్ప విలన్‌ ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆవేశం. గతనెల 11న మలయాళంలో రిలీజైన చిత్రం బ్లాక్‍బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మలయాళంలో హిట్ అయిన తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం మలయాళంలో మాత్రమే స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ చిత్రం.. త్వరలోనే తెలుగు డబ్బింగ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

భారీ ధరకు ఓటీటీ డీల్

సూపర్‌ హిట్‌ మూవీ కావడంతో ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. రూ.35 కోట్లను చెల్లించి అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా అత్యధిక మొత్తం పొందిన మలయాళ చిత్రంగా ఆవేశం రికార్డు దక్కించుకుంది. కాగా.. ఈ సినిమాను రూ.30 కోట్లతో తెరకెక్కించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement