
పుష్ప సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఫాహద్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలోనూ కనిపించనున్నారు. పుష్ప-2తో పాటు రజినీకాంత్ వెట్టాయన్ మూవీలో కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఆయనకు మరో క్రేజీ ఆఫర్ తలుపు తట్టినట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తోన్న చిత్రం 'కూలీ'. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఫహద్ ఫాసిల్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కూలీ మేకర్స్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మరోసారి రజినీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఇప్పటికే దర్శకుడు టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తోన్న వెట్టాయన్‌లో రజినీకాంత్, ఫాహద్ ఫాజిల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ఫాహద్ ఫాజిల్ ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ 'వెట్టాయన్', అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్‌తో పాటు తమిళంలో మారీసన్, మలయాళంలో 'ఒడుమ్ కుతిర చదుమ్ కుతిరా', 'బౌగెన్విల్లా' 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాల్లో నటిస్తున్నారు. మరీ ఈ చిత్రాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది. కాగా.. లోకేష్ కనగరాజ్ 'కూలీ' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
Comments
Please login to add a commentAdd a comment