హీరో మరీ కమర్షియల్ అయిపోయారు. ఎంతలా అంటే హిట్ పడటమే లేటు కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మిడ్ రేంజ్ హీరోలు కూడా తామేం తక్కువ అని కోట్ల రూపాయల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇలా అంత ఫేమ్ లేని హీరోలే కోట్లు తీసుకుంటుండగా, పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు మాత్రం తన రెమ్యునరేషన్‌తో షాకిస్తున్నాడు.
(ఇదీ చదవండి: హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో)
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సినిమాల చూస్తే కచ్చితంగా అతడికి ఫ్యాన్ అయిపోతారు. ఎందుకంటే మంచి మూవీస్ చేయడమే కాదు చాలా వేగంగా వాటిని పూర్తి చేస్తాడు. ప్రతి మూడు నాలుగు నెలలకు పహాద్ మూవీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ పక్కనబెడితే 'పుష్ప 2'లో నటిస్తున్నందుకు గానూ రెమ్యునరేషన్ రోజువారీగా తీసుకుంటున్నారు. దీనికి కొన్ని వింత కండీషన్స్ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఎందుకంటే రోజుకి రూ.12 లక్షల‍్ని రెమ్యునరేషన్‌గా ఫిక్స్ చేసిన ఫహాద్.. ఒకవేళ తాను హైదరాబాద్ వచ్చిన తర్వాత షూటింగ్ రద్దయితే మాత్రం అదనంగా మరో రూ.2 లక్షలు అంటే మొత్తంగా రోజుకి రూ.14 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందట. షూట్ క్యాన్సిల్స్ చేయకుండా కచ్చితంగా ముందు జాగ్రత్తగా ఉంటారని బహుశా ఫహాద్.. 'పుష్ప' నిర్మాతలకు ఈ కండీషన్ పెట్టి ఉండొచ్చని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా మనోడి ఇంత ప్లానింగ్‌తో ఉన్నాడు కాబట్టే వరస మూవీస్ చేస్తూ హిట్ కొడుతున్నాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!)
Comments
Please login to add a commentAdd a comment