ఇండియన్ సినిమాలో 'పుష్ప: ది రైజ్' చెరిగిపోని ముద్ర వేసింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2021లో విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. పుష్పలో SP భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో అదరగొట్టేశాడు. ఈ సినిమాకు ముందే మలయాళ ఇండస్ట్రీలో ఆయనొక స్టార్ యాక్టర్‌గా ఉన్నారు. పుష్పతో ఫహాద్ ఫాజిల్ రేంజ్ పాన్ ఇండియా స్థాయిలో చేరుకుంది. అయితే ఈ సినిమా వల్ల తనకు పెద్దగా ఒరిగిందేమి లేదని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్‌గానే చెప్పేశాడు.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ ఫాజిల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా నటుడిగా మారారని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి కదా.. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది.
'పుష్ప సినిమా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ చిత్రం వల్ల నేను ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఇదే విషయం సుకుమార్ సార్‌కు కూడా చెప్పాను. ఇందులో నేను దాచడం లేదు. అబద్దం చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కువగా మలయాళ సినిమాల్లోనే నటించాను. అయితే, మలయాళం భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్కటే నాలో సంతోషాన్ని నింపింది. నేను ఏ ప్రాంతాన్ని, ఎవరినీ అగౌరపరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు.' అని ఆయన అన్నారు. ఏదేమైనా పాన్ ఇండియా రేంజ్‌లో తనను పుష్ప చేర్చలేదని ఫహాద్‌ఫాజిల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment