Fahadh Faasil Comments On Allu Arjun And Sukumar - Sakshi
Sakshi News home page

లక్కీగా వారిద్దరితో నటించే చాన్స్‌ వచ్చింది, హ్యాపీ: ఫాహద్‌ ఫాజిల్‌

Published Thu, Jul 15 2021 9:22 PM | Last Updated on Fri, Jul 16 2021 11:37 AM

Fahadh Faasil Comments On Allu Arjun And Sukumar - Sakshi

మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ నటించిన మాలిక్‌ చిత్రం ఈరోజు ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసందే. విభిన్న కథలను ఎంచుకుంటూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫాహద్‌ ఫాజిల్‌కు మాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇక గురువారం విడుదలైన ‘మాలీక్‌’ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ క్రమంలో ఫాహద్‌ ఓ ఛానల్‌తో ముచ్చటిచ్చాడు. ఈ సందర్భంగా పుష్ప మూవీ గురించి చెప్పుకొచ్చాడు.

‘పుష్ప ఆఫర్‌ రావడానికి ముందే నేను డైరెక్టర్‌ సుకుమార్‌ సినిమాలు చూసేవాడిని. ఆయన క్యారెక్టరైజేషన్‌ చాలా ఆసక్తిగా ఉంటుంది. దీంతో ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే బాగుండని తరచూ అనుకునేవాడిని. అలాగే అల్లు అర్జున్‌ సినిమాలు కూడా చూశాను. తను ఎంచుకునే కథలు.. పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ముఖ్యంగా బన్ని డాన్స్ బాగా చేస్తాడు. తనతో కలిసి ఒక సినిమా అయినా చేయాలనుకున్నాను. లక్కీగా ఇద్దరితో కలిసి చేసే అవకాశం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే షూటింగులో జాయిన్ అవుతాను’ అని ఫాహద్‌ పేర్కొన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement