ఆయన స్వయానా ముఖ్యమంత్రి కొడుకు. తమిళనాడు ప్రభుత్వంలో ప్రస్తుతం క్రీడాశాఖ మంత్రి. మరోవైపు హీరోగా తన కెరీర్ లోనే చివరి సినిమా చేశారు. ఆయనే ఉదయనిధి స్టాలిన్. చిత్రం పేరు 'మామన్నన్'. ఇందులో ఏముంది అంత గొప్ప అనుకోవచ్చు. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరో కాస్తోకూస్తో తెలిసి ఉండొచ్చేమో. కానీ ఈ చిత్రంలో కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్, వడివేలు లాంటి అద్భుతమైన యాక్టర్స్ నటించారు. 'కర‍్ణన్'తో హిట్ కొట్టిన మరి సెల్వరాజు దర్శకుడు కావడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ 'మామన్నన్' ఎలా ఉంది?
'మామన్నన్' కథేంటి?
కాశీపురం అనే ఊరు. దానికి మామన్నన్(వడివేలు) ఎమ్మెల్యే. వెనకబడిన వర్గానికి చెందినవాడు. కొడుకు అదివీరన్(ఉదయనిధి స్టాలిన్). అభ్యుదయ భావాలున్న కుర్రాడు. మరోవైపు పేద విద్యార్థుల కోసం లీల(కీర్తి సురేష్) కోచింగ్ సెంటర్ నడుపుతుంటుంది. రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేల్(ఫహాద్ ఫాజిల్) అన్నయ్య వల్ల ఈమెకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో మామన్నన్, అదివీరన్ కలిసి రత్నవేల్ కు ఎదురెళ్తారు. అతడి పతనం కోసం పనిచేయడం మొదలుపెడతారు. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఫైనల్ గా ఏం జరిగిందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ)
టాక్ ఏంటి?
మరి సెల్వరాజ్.. గతంలో 'పరియారుమ్ పెరిమాళ్', 'కర్ణన్' లాంటి క్లాసిక్స్ తో మెప్పించారు. ఈ రెండూ ధనిక వర్సెస్ పేద అనే కాన్సెప్ట్‌తోనే తీశారు. ఇప్పుడు 'మామన్నన్' చిత్రాన్ని అదే తరహా స్టోరీతో తీశారు. కాకపోతే ఈసారి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఇది కొంతవరకు అయితే బాగుండేది కానీ మరీ ఎక్కువ కావడంతో సెకండాఫ్ లో రొటీన్ గా అనిపించిందని చెబుతున్నారు. ఇది తప్పితే సినిమా నెక్స్ట్ లెవల్ ఉందని ప్రేక్షకుల్ని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ అయితే కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. వడివేలు, ఫహాద్ ఫాజిల్.. ఒకరిని మించి మరొకరు అన‍్నట్లు నటించారట. ఏఆర్ రెహమాన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
కలెక్షన్స్ ఎంత?
గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్న ఉదయనిధి స్టాలిన్.. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి కావడం, రాజకీయాల‍్లో బిజీగా ఉండటం వల్ల 'మామన్నన్'.. తన చివరి సినిమా అని చాన‍్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇక థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాకు హిట్ టాక్ రావడం ఓ ప్లస్ అయితే, తొలిరోజు రూ.5.5 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమైతే ఉదయనిధి కెరీర్ లోనే అత్యధికం అవుతుంది. ఈ వసూళ్లపై క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment