కోల్కతా : కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు సీబీఐకి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో మంగళవారం (ఆగస్ట్20న) సీబీఐ అధికారులు సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఆర్‌జీ కార్ ఆస్పత్రి ఘటన పశ్చిమబెంగాల్‌ను కుదిపేస్తోంది. రోజులు గడిచే కొద్ది రోజుకో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెపై సామూహికంగా దారుణం జరిగి ఉంటుందని ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మృతదేహంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు తేలడంతో ఈ దారుణంలో తలెత్తుతున్న అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
దీంతో రోజులు గడస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్ట్ 13న కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తరుణంలో కేసులో నిజానిజాలు తెలుసుకునేందుకు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు అనుమతినివ్వాలని కోల్‌కతా హైకోర్టను సీబీఐ కోరింది. తాజాగా అందుకు అంగీకరించిన కోర్టు.. కేసు తదుపరి విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment