బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతటి వివాదం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్‌లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.
చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్
ఇటీవల ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ విచారణలో రణ్‌వీర్ అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరైన రణ్‌వీర్‌ను పోలీసులు 2 గంటలకుపైగా విచారించినట్లు సమాచారం. తన నగ్న ఫొటోషూట్‌పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అదే విధానాన్ని కొనసాగించాడట రణ్‌వీర్. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట అతడు.
చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్
ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్‌లోడ్ కానీ, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో రణ్‌వీర్‌పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment