Nude Photography
-
స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్ చేసిన ఈ కొత్తజంట ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గతంలో కియారా చేసిన ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూ రత్నానీ తీసిన ఫోటోను తాజాగా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. గతంలో 2021 క్యాలెండర్ కోసం ఈ ఫోటోకు ఫోజులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే కియారా డబ్బు కోసం టాప్‌లెస్‌గా కనిపించలేదని ఫోటోగ్రాఫర్ రత్నానీ తెలిపారు. కియారా చిత్రాన్ని ముంబైలోని ఒక హోటల్లో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. నేను గతంలో కూడా చాలా మంది హీరోయిన్లతో ఇలాంటి ఫోటో షూట్ తీశానని తెలిపారు. 2020లో కియారా చేసిన ఫోటోషూట్ కూడా వివాదాన్ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. గతంలో కృతి సనన్, దీపికా పదుకొనే, విద్యాబాలన్, సన్నీ లియోన్, పరిణీతి చోప్రా, టబు క్యాలెండర్ కోసం టాప్‌లెస్‌గా పోజులిచ్చారు. -
నగ్న ఫొటోషూట్ కేసు: విచారణలో రణ్వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతటి వివాదం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ మ్యాగజైన్ కోసం రణ్వీర్ సింగ్ ఇటీవల నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రణ్‌వీర్‌పై పోలీసు కేసు కూడా నమోదైంది. ఇక మహిళ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై పోలీసు స్టేషన్లో రణ్‌వీర్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్, వీడియో షేర్ చేసిన మెగాస్టార్ ఇటీవల ఈ కేసులో ముంబై పోలీసులు రణ్‌వీర్‌కు సమన్లు జారీ చేసి ఈనెల 22న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ విచారణలో రణ్వీర్ అమాయకత్వాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. రీసెంట్గా ముంబైలోని చెంబూరు పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైన రణ్వీర్ను పోలీసులు 2 గంటలకుపైగా విచారించినట్లు సమాచారం. తన నగ్న ఫొటోషూట్‌పై వివాదం నెలకొన్నప్పటికీ రణవీర్ సింగ్ ఇంత వరకు నోరు విప్పకపోవడం గమనార్హం. పోలీసుల ముందు కూడా అదే విధానాన్ని కొనసాగించాడట రణ్వీర్. ఫొటోషూట్ పరిణామాలపై తనకు అవగాహన లేదంటూ బుకాయిచ్చాడట అతడు. చదవండి: సుమన్ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్ చానళ్లకు నటుడు వార్నింగ్ ఇక పోలీసులు ఏం అడిగిన ఇదే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏదైనా పోలీసులకు నేరుగా చెప్పాలని, మీడియాకు ఎలాంటి ప్రకటన ఇవ్వొద్దంటూ రణవీర్ సింగ్ అతడి న్యాయవాదులు సూచించినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ మొత్తం విచారణ సమయంలో రణవీర్ మౌనంగా ఉన్నాడని, ఫొటోలను తాను అప్లోడ్ కానీ, పబ్లిష్ చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా ఈ కేసులో రణ్‌వీర్‌పై ఐపీసీ సెక్షన్ 292, 294, 509, 67(ఏ) కింద కేసులు నమోదు చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి సమన్లు ఇచ్చి పిలిపిస్తామని విచారణాధికారి వెల్లడించారు. -
రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్ ఫొటోతో రచ్చ
బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఈ సంఘటనలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రణ్‌వీర్‌కు మద్దతు తెలుపగా పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం తెలిపారు. రణ్వీర్ ఫొటోషూట్ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ అతడిపై ముంబై కోర్టులో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ వ్యవహరంపై వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో రణ్వీర్ బాటలోనే ఓ నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్ చేసి వార్తల్లోకి ఎక్కింది. చదవండి: మీ మాజీ భర్త షాహిద్ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్ చూశారా? అంతేకాదు దీనికి ఆమె జత చేసిన క్యాప్షన్ చర్చనీయాంశమైంది. రోహిత్ శెట్టి ‘ఖత్రోన్ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్ తాజాగా తన టాప్‌లెస్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘దీనికి రణ్వీర్ సింగ్‌కు కంపెనీ ఇస్తున్నా.. కానీ మీరు నా బమ్స్ చూడలేరు’ అంటూ వివాస్పద క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఆమె బోల్డ్ ఫొటోషూట్‌పై బాలీవుడ్ బుల్లితెర నటీనటులు, ఫాలోవర్స్ ప్రశంసలు కురిపిస్తూ ఎరికాకు మద్దతు తెలుపుతుంటే.. పలువురు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ‘మరో వివాదానికి తెరలేపింది’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్ View this post on Instagram A post shared by Erika packard ❤️ (@erikapackard) -
రణ్‌వీర్‌కు వెర్రి ఎక్కువ.. తన నుంచి ఇది ఆశించడం సహజమే: నటి
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నగ్న ఫొటోషూట్ చేస్తున్న రచ్చ అంతాఇంతా కాదు. దీనిని కొందరు రణ్వీర్ను ప్రశంసిస్తోంటే మరికొందరు తప్పు బడుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఫొటోలకు ఫోజులు ఇచ్చిన మహిళల మనోభవాలను దెబ్బతీశాడని ఆరోపిస్తూ స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు రణ్వీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. చదవండి: షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ దీనిని ఖండిస్తూ ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి రణ్‌వీర్‌కు మద్దతుగా నిచ్చాడు. తాజాగా నటి, మోడల్ కోయినా మిత్రా సైతం రణ్‌వీర్‌ని సమర్థించింది. రణవీర్ సాహసం చేశాడంటూ అతడిపై ప్రశంసలు జల్లు కురిపించింది. తాజాగా ఆమె మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భందగా రణ్వీర్ నగ్నఫొటోషూట్పై స్పందిస్తూ అందులో తప్పేముందంటూ వెనకెసుకొచ్చింది. ‘రణ్వీర్ గురించి అందరికి తెలిసిందే. ప్రయోగాలు చేసే నటుల్లో ఆయన ముందుంటాడు. తొటి నటీనటుల పట్ల, ప్రజల పట్ల, ఫ్యాన్స్‌తో చాలా సరదాగా ఉంటాడు. ఆయన చిల్డ్ అవుట్ గాయ్. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి ఆశించడంలో తప్పులేదు. ఆయనకు కాస్తా వెర్రి ఎక్కువ. దానితోనే అందరిని ఆకర్షిస్తాడు. స్క్రీన్‌పై అయినా స్టేజ్‌పై ఆయినా తన ఎనర్జీ అంటే నాకు ఇష్టం. రణ్వీర్ మిగతా నటుల కంటే కొంచం భిన్నం. అలాంటి తను ప్రజలను ఆకర్షించడానికి ఇలా చేశాడంటే నేను ఒప్పకొను. ఆయనకు ఆ అవసరం కూడా లేదు. తనో స్టార్. ఇది కేవలం సరదా కోసం, కాస్తా క్రేజీగా ఉండేందు ఇలా చేశాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. అదే ఫన్‌తో ఈ ఫొటోలు షేర్ చేసి ఉంటాడు. కానీ భారతీయులు ఎప్పుడు ఇతరులను జడ్జ్ చేయడంలో ముందుంటారు కదా’ అంటూ చెప్పుకొచ్చింది. -
రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్.. నటుడిపై కేసు నమోదు
ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పేరు మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్లైన్లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పేపర్ మ్యగజైన్ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా నటుడు ఈ ఫొటోషూట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్ హాట్’ అంటూ రణ్వీర్ కోస్టార్స్, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక నటుడి బోల్డ్ ఫోజులపై అనేక సోషల్ మీడియాలో పుట్టేడు మీమ్స్ సైతం పుట్టుకొచ్చాయి. మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు, విమర్శలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా నగ్న షోటోషూట్ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. చదవండి: Katrina Kaif-Vicky Kaushal: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్ ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్వీర్ సింగ్‌పై ముంబైలో చెంబూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, లేదా తనను చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్వీర్ కంటే ముందు విజయ్ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్ సైతం న్యూడ్ ఫోటోలకు పోజులిచ్చి హాట్ టాపిక్‌గా మారారు. -
నూలుపోగు లేని దేహం
అద్దంలో అద్భుతం అనిపించేంత అందంగా ఉండొచ్చు. కానీ దాన్ని ఇష్టారాజ్యంగా ప్రదర్శించేందుకు వీలులేదు. దాని మీద హక్కులకూ పరిమితులున్నాయి.అందుకేనేమో న్యూడ్ ఫొటోగ్రఫీ ఇప్పటికీ అరుదైన విభాగంగానే వర్ధిల్లుతోంది. ఫొటోగ్రఫీ ప్రొఫెషన్లో అత్యంత పురాతనమైనదీ, ఇప్పటికీ అరుదైనదీ, చాలా తక్కువ మంది ఎంచుకునే ది న్యూడ్ ఫొటోగ్రఫీ. సంప్రదాయాలు, కట్టుబాట్లకు పట్టం కట్టే మన దేశంలోనూ న్యూడ్ ఫొటోగ్రాఫర్లు, న్యూడ్ మోడల్స్ లేకపోలేదు. సిటీకీ సుపరిచితమే. న్యూడ్ ఫొటో అంటే ఒక వ్యక్తిని పాక్షికంగా లేదా పూర్తి నగ్నంగా తీసే ఛాయాచిత్రం. ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్, హ్యూమన్ సైకాలజీ, సెక్స్ ఎడ్యుకేషన్... తదితర శాస్త్ర, విద్యా, పరిశోధనల్లో నగ్న చిత్రం ఒక అవసరం. అయితే ఇతరత్రా అవసరాలకు వీటిని ప్రదర్శించడం, ప్రచురించడం తరచుగా వివాదాస్పదం అవుతుంటుంది. కొన్ని సంస్కృతులు, దేశాలు వీటిపై చాలా కఠినంగా ఉంటాయి. చాలా వరకూ నగ్నచిత్రాల్లో మహిళలే సబ్జెక్టులుగా మారుతుంటారు. పురుషుల నగ్నచిత్రాలు అరుదే. ఇక గ్లామర్ రంగంలో అయితే వీటి లక్ష్యం వేరే. పంకజ్షా, ప్రబుద్ధదాస్గుప్తా వంటి టాప్‌క్లాస్ ఫొటోగ్రాఫర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం జీవించి లేని ప్రబుద్ధ దాస్ తను తీసిన నగ్న చిత్రాలతో ‘ఉమెన్’ పుస్తకం కూడా ప్రచురించారు. ఇప్పుడున్న వారిలో అతుల్ కస్బేకర్ (పాక్షిక నగ్నచిత్రాలు) కింగ్‌ఫిషర్ కేలండర్ ద్వారా పేరొందారు. సిటీ ‘చూసింది’... నగర అసలు స్వరూపాన్ని ఫొటోలో అత్యద్భుతంగా బంధించిన వారిలో అగ్రగణ్యుడు రాజన్‌బాబు. రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ కోసం రాజన్‌బాబు ‘న్యూడ్ ఇన్ నేచర్’ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఆ సమయంలోనే కొందరిని శిష్యులుగా తయారు చేశారు. ఫ్యాషన్ రంగం విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ వినియోగం కోసం, అంతర్జాతీయ మేగజైన్ల కోసం.. నగరంలో న్యూడ్ చిత్రాలు తయారవుతూనే ఉన్నాయి. అయితే వీటి వివరాలు గోప్యంగా ఉంటాయి. సదరు మోడల్ రిలీజింగ్ ఫాం మీద సంతకం చేస్తేనే ఆ చిత్రాలు పబ్లిష్ చే సే వీలుంటుంది. ప్రస్తుతం సిటీలో న్యూడ్ పిక్చర్స్ సబ్జెక్ట్‌గా చేసేందుకు మోడల్స్ దొరకడం దుర్లభంగా మారిందంటున్నారు ఫొటోగ్రాఫర్లు. ఈ ఫొటోషూట్ల కోసం నార్త్ ఇండియా మీదే వారు ఆధారపడుతున్నారు. నేనూ తీశా... ఈ తరహా చిత్రాలు తీసిన అనుభవం నాకుంది. నిజానికి న్యూడ్ పిక్చర్స్ తీయడం అంత ఈజీ కాదు. నగ్నత్వంలోనూ అందంగా కనపడాలంటే అది చాలా గొప్ప అందమై ఉండాలి. రిచ్ సర్కిల్లో తమ న్యూడ్ పిక్చర్స్‌ను కొందరు అమ్మాయిలు పార్ట్నర్స్కి గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా నాకు తెలుసు. అది వారి వ్యక్తిగతం. అయితే సిటీలో గతంలో కంటే నగ్నచిత్రాలు తీయడం పెరిగిందనేది మాత్రం నిస్సందేహం. - అరవింద్ ఛెంజి ఫొటోగ్రాఫర్