నూలుపోగు లేని దేహం | REALPicture | Sakshi
Sakshi News home page

నూలుపోగు లేని దేహం

Published Tue, Aug 19 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

నూలుపోగు లేని దేహం

నూలుపోగు లేని దేహం

అద్దంలో అద్భుతం అనిపించేంత అందంగా ఉండొచ్చు. కానీ దాన్ని ఇష్టారాజ్యంగా ప్రదర్శించేందుకు వీలులేదు. దాని మీద హక్కులకూ పరిమితులున్నాయి.అందుకేనేమో న్యూడ్ ఫొటోగ్రఫీ ఇప్పటికీ అరుదైన విభాగంగానే వర్ధిల్లుతోంది. ఫొటోగ్రఫీ ప్రొఫెషన్‌లో అత్యంత పురాతనమైనదీ, ఇప్పటికీ అరుదైనదీ, చాలా తక్కువ మంది ఎంచుకునే ది న్యూడ్ ఫొటోగ్రఫీ. సంప్రదాయాలు, కట్టుబాట్లకు పట్టం కట్టే
 మన దేశంలోనూ న్యూడ్ ఫొటోగ్రాఫర్లు, న్యూడ్ మోడల్స్  లేకపోలేదు. సిటీకీ సుపరిచితమే.
 
న్యూడ్  ఫొటో అంటే ఒక  వ్యక్తిని పాక్షికంగా లేదా పూర్తి నగ్నంగా తీసే ఛాయాచిత్రం. ఎథ్నోగ్రాఫిక్ స్టడీస్, హ్యూమన్ సైకాలజీ, సెక్స్ ఎడ్యుకేషన్... తదితర శాస్త్ర, విద్యా, పరిశోధనల్లో నగ్న చిత్రం ఒక అవసరం. అయితే ఇతరత్రా అవసరాలకు వీటిని ప్రదర్శించడం, ప్రచురించడం తరచుగా వివాదాస్పదం అవుతుంటుంది. కొన్ని సంస్కృతులు, దేశాలు వీటిపై చాలా కఠినంగా ఉంటాయి. చాలా వరకూ నగ్నచిత్రాల్లో మహిళలే సబ్జెక్టులుగా మారుతుంటారు. పురుషుల నగ్నచిత్రాలు అరుదే. ఇక  గ్లామర్ రంగంలో అయితే వీటి లక్ష్యం వేరే. పంకజ్‌షా, ప్రబుద్ధదాస్‌గుప్తా వంటి టాప్‌క్లాస్ ఫొటోగ్రాఫర్లు ఈ రంగంలో సంచలనాలు సృష్టించారు. ప్రస్తుతం జీవించి లేని ప్రబుద్ధ దాస్ తను తీసిన నగ్న చిత్రాలతో ‘ఉమెన్’ పుస్తకం కూడా ప్రచురించారు. ఇప్పుడున్న వారిలో అతుల్ కస్బేకర్ (పాక్షిక నగ్నచిత్రాలు) కింగ్‌ఫిషర్ కేలండర్ ద్వారా పేరొందారు.

సిటీ ‘చూసింది’...

నగర అసలు స్వరూపాన్ని ఫొటోలో అత్యద్భుతంగా బంధించిన వారిలో అగ్రగణ్యుడు రాజన్‌బాబు. రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ కోసం రాజన్‌బాబు ‘న్యూడ్ ఇన్ నేచర్’ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఆ సమయంలోనే కొందరిని శిష్యులుగా తయారు చేశారు. ఫ్యాషన్ రంగం విజృంభణ నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేట్ వినియోగం కోసం, అంతర్జాతీయ మేగజైన్ల కోసం.. నగరంలో న్యూడ్ చిత్రాలు తయారవుతూనే ఉన్నాయి. అయితే వీటి వివరాలు గోప్యంగా ఉంటాయి. సదరు మోడల్ రిలీజింగ్ ఫాం మీద సంతకం చేస్తేనే ఆ చిత్రాలు పబ్లిష్ చే సే వీలుంటుంది. ప్రస్తుతం సిటీలో న్యూడ్ పిక్చర్స్ సబ్జెక్ట్‌గా చేసేందుకు మోడల్స్ దొరకడం దుర్లభంగా మారిందంటున్నారు ఫొటోగ్రాఫర్లు. ఈ ఫొటోషూట్‌ల కోసం నార్త్ ఇండియా మీదే వారు ఆధారపడుతున్నారు.

నేనూ తీశా...

ఈ తరహా చిత్రాలు తీసిన అనుభవం నాకుంది. నిజానికి న్యూడ్ పిక్చర్స్ తీయడం అంత ఈజీ కాదు. నగ్నత్వంలోనూ అందంగా కనపడాలంటే అది చాలా గొప్ప అందమై ఉండాలి. రిచ్ సర్కిల్‌లో తమ న్యూడ్ పిక్చర్స్‌ను కొందరు అమ్మాయిలు పార్ట్‌నర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వడం కూడా నాకు తెలుసు. అది వారి వ్యక్తిగతం. అయితే సిటీలో గతంలో కంటే నగ్నచిత్రాలు తీయడం పెరిగిందనేది మాత్రం నిస్సందేహం.
 
 - అరవింద్ ఛెంజి
     ఫొటోగ్రాఫర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement