Ranveer Singh Accused of Hurting women Sentiments Over Nude Shoot - Sakshi
Sakshi News home page

Ranveer Singh: పిచ్చి పీక్సా? అయితే స్టేషన్ కు రండి!

Jul 25 2022 7:23 PM | Updated on Jul 28 2022 8:00 PM

Ranveer Singh Accused of Hurting women Sentiments Over Nude Shoot - Sakshi

ప్రస్తుతం ఎక్కడ విన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ పేరు మార్మోగుతోంది. ఏ సోషల్‌ మీడియా సైట్‌లో చూసిన ఆయన లెటేస్ట్‌ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్‌ ఫోటోషూట్‌ ఫోటోస్‌ ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాడు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పేపర్‌ మ్యగజైన్‌ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా నటుడు ఈ ఫొటోషూట్‌ చేశారు. 

ఈ ఫోటోలు నెట్టింట్లో సంచలనంగా మారాయి. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నమైన స్పందన లభిస్తోంది. ‘సూపర్‌ హాట్‌’ అంటూ రణ్‌వీర్‌ కోస్టార్స్‌, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇక నటుడి బోల్డ్‌ ఫోజులపై అనేక సోషల్‌ మీడియాలో పుట్టేడు మీమ్స్‌ సైతం పుట్టుకొచ్చాయి. మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు, విమర్శలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా నగ్న షోటోషూట్‌ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది.
చదవండి: Katrina Kaif-Vicky Kaushal: ‘కత్రినా నా భార్య’ అంటూ వీడియోలు, ఫొటోలు.. నిందితుడి అరెస్ట్‌

ఓ ఎన్జీఓ ఫిర్యాదు మేరకు రణ్‌వీర్‌ సింగ్‌పై ముంబైలో చెంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆరోపణలతో కేసు నమోదు చేశారు పోలీసులు.  అంతకుముందు.. రణ్‌వీర్‌కు చాలా మంది సెలబ్రిటీలు మద్దుతు ఇస్తుండటంతో.. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్‌ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్‌సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు. ఒకవేళ మహిళ ఫోటోషూట్‌ చేస్తే ఇప్పటికే ఆమె ఇంటిని తగలబెట్టే వారని, లేదా తనను చంపేస్తామని బెదిరించేవారని పేర్కొన్నారు. కాగా రణ్‌వీర్‌ కంటే ముందు విజయ్‌ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్‌ సైతం న్యూడ్‌ ఫోటోలకు పోజులిచ్చి హాట్‌ టాపిక్‌గా మారారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement