After Ranveer Singh Khatron Ke Khiladi 12 Fame Erika Packard In Topless Photo - Sakshi
Sakshi News home page

Actress Erika Packard: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్‌ ఫొటోతో రచ్చ

Published Fri, Aug 5 2022 6:31 PM | Last Updated on Fri, Aug 5 2022 7:23 PM

After Ranveer Singh Khatron Ke Khiladi 12 Fame Erika Packard In Topless Photo - Sakshi

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నగ్న ఫొటోషూట్‌ ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లదు. ఈ సంఘటనలో సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు రణ్‌వీర్‌కు మద్దతు తెలుపగా పలు సామాజిక, మహిళ సంఘాలు అభ్యంతరం తెలిపారు. రణ్‌వీర్‌ ఫొటోషూట్‌ మహిళల మనోభవాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ అతడిపై ముంబై కోర్టులో కేసు కూడా నమోదు చేశారు. ఇప్పటికి ఈ వ్యవహరంపై వివాదం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో రణ్‌వీర్‌ బాటలోనే ఓ నటి టాప్‌లెస్‌గా ఫొటోషూట్‌ చేసి వార్తల్లోకి ఎక్కింది.

చదవండి: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

అంతేకాదు దీనికి ఆమె జత చేసిన క్యాప్షన్‌ చర్చనీయాంశమైంది. రోహిత్‌ శెట్టి ‘ఖత్రోన్‌ కె ఖిలాడి 12’ ఫేం,టీవీ నటి ఎరికా ప్యాకర్డ్‌ తాజాగా తన టాప్‌లెస్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ‘దీనికి రణ్‌వీర్‌ సింగ్‌కు కంపెనీ ఇస్తున్నా.. కానీ మీరు నా బమ్స్‌ చూడలేరు’ అంటూ వివాస్పద క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక ఆమె బోల్డ్‌ ఫొటోషూట్‌పై బాలీవుడ్‌ బుల్లితెర నటీనటులు, ఫాలోవర్స్‌ ప్రశంసలు కురిపిస్తూ ఎరికాకు మద్దతు తెలుపుతుంటే.. పలువురు నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. ‘మరో వివాదానికి తెరలేపింది’ అంటూ తమదైన శైలిలో కామెంట్స్‌ చేస్తున్నారు. 

చదవండి: అంత్యక్రియలకు గైర్హాజరు.. భార్యతో కలిసి మేనత్త ఇంటికెళ్లిన తారక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement