దక్షిణ కొరియా దౌత్యవేత్తతో కిమ్ కరచలనం
సియోల్ : కొత్త చరిత్ర లిఖించేందుకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సిద్ధమైపోయాడు. దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధమైపోయాడు. ఈ మేరకు సియోల్ అధికార వర్గం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తొలి దశలో కిమ్‌తో చర్చించేందుకు ఇద్దరు ప్రతినిధులను పంపగా.. వారితో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు సియోల్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పొరుగు దేశంతో మైత్రికి చెయ్యి చాస్తున్నట్లు కిమ్ జోంగ్ ఉన్ పేరిట ప్యాంగ్ యాంగ్ మీడియాలో వార్తలు ప్రసారం అవుతున్నాయి. ఇక విడతల వారి చర్చలు అక్కర్లేదని.. త్వరలో మూన్ జాయ్ ఇన్.. కిమ్‌తో భేటీ అవుతారని ప్రకటించింది.
కొరియన్ వార్ తర్వాత ఈ రెండు దేశాల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ కొరియా వైపు నిలిచిన అమెరికా.. ఉత్తర కొరియాకు బద్ధ శత్రువుగా మారిపోయింది. ఆ మధ్య ఇరు దేశాల చర్చల ప్రస్తావన రాగా.. కిమ్‌ను అంత తేలికగా నమ్మకూడదంటూ దక్షిణ కొరియాకు సలహా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు అమెరికాకు మింగుడుపడని వ్యవహారమనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment