కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం | Manipur Insurgent Group UNLF Agrees To Renounce Violence And Signs Peace Pact, Amit Shah Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం.. అమిత్ షా కీలక ప్రకటన

Published Wed, Nov 29 2023 6:34 PM | Last Updated on Wed, Nov 29 2023 7:09 PM

Manipur Insurgent Group UNLF Signs Peace Pact - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. 

శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్‌ఎల్‌ఎఫ్‌ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి   స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. 

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్‌ఎల్‌ఎఫ్‌ కూడా ఉంది. యూఎన్ఎల్‌ఎఫ్‌ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు.  

ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement