birendar singh
-
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
బీజేపీ బంపర్ ఆఫర్.. ఉచితంగా స్కూటీలు, లాప్ ట్యాప్స్
ఇంపాల్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కమలం నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా గెలుపే లక్ష్యంగా బంపర్ ఆఫర్లతో ప్రజలపై హామీల వర్షం కురిస్తున్నారు. ముణిపూర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మణిపూర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలను అరికట్టడంతో సీఎం విజయవంతమయ్యారని కొనియాడారు. మేనిఫెస్టోలోని అంశాలు.. - వృద్ధాప్య పింఛన్ రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు. - ఉన్నత విద్య కోసం విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం. - 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు. - ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు. - ఉచితంగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు. - మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు ఉచిత బీమా. - పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు. -మహిళలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం. - పీజీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు. - సాంస్కృతిక వారసత్వం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ. - ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు.