ఇంపాల్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కమలం నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా గెలుపే లక్ష్యంగా బంపర్ ఆఫర్లతో ప్రజలపై హామీల వర్షం కురిస్తున్నారు. ముణిపూర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గురువారం మేనిఫెస్టోను విడుదల చేసింది.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో మణిపూర్ ప్రజలకు వరాలు ప్రకటించారు. ఈ సందర్బంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. సీఎం బీరేన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. రాష్ట్రంలో మత్తు పదార్దాలను అరికట్టడంతో సీఎం విజయవంతమయ్యారని కొనియాడారు.
మేనిఫెస్టోలోని అంశాలు..
- వృద్ధాప్య పింఛన్ రూ. 200 నుంచి రూ. 1000కి పెంపు.
- ఉన్నత విద్య కోసం విద్యార్థినులకు రూ. 25 వేల ఆర్థిక సాయం.
- 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లు.
- ప్రతిభ కనబరినచిన విద్యార్థినులకు ఉచితంగా స్కూటీలు.
- ఉచితంగా ఏడాదికి రెండు ఎల్పీజీ సిలిండర్లు.
- మత్స్యకారులకు రూ.5 లక్షల వరకు ఉచిత బీమా.
- పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి ఏడాదికి అందించే ఆర్థిక సాయం రూ. 6 వేల నుంచి రూ. 8 వేలకు పెంపు.
-మహిళలు, యువత, రైతులకు సాధికారత కల్పించడం.
- పీజీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న రైతుల పిల్లలకు స్కాలర్షిప్లు.
- సాంస్కృతిక వారసత్వం, స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ.
- ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఏర్పాటు.
Comments
Please login to add a commentAdd a comment