పాట్నా: బీహార్‌లో బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీలు కలిసి కూటమిగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. జేపీ నడ్డా ఓ సమావేశంలో ఆదివారం మాట్లాడుతూ.. తమ కూటమి సీఎం అభ్యర్థిగా నితీష్ కుమార్ ఉంటారని, అఖండ మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రతిపక్ష పార్టీల పాత్ర నామమాత్రమని అన్నారు.
ప్రతిపక్ష పార్టీకి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశ్యం లేదని, కేవలం అవకాశవాద రాజకీయాలు చేయడానికి పరిమితమయ్యాయని విమర్శించారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూకు, చిరాగ్ పాశ్వార్ నేతృత్వంలోని ఎల్‌జేపీకి మధ్య కొద్దికాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే, బీజేపీ మాత్రం రెండు భాగస్వామ్య పార్టీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమారే ఉంటారని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment