Nitish Kumar: బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం.. | Nitish Kumar Takes Oath As Bihar CM For Record 9th Time | Sakshi
Sakshi News home page

Nitish Kumar: బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం..

Published Sun, Jan 28 2024 5:17 PM | Last Updated on Sun, Jan 28 2024 6:30 PM

Nitish Kumar Takes Aath As Bihar CM For 9th Time - Sakshi

పట్నా: బీహార్‌లో మరో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్‌ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నితీష్‌ కుమార్‌తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్  ప్రమాణం స్వీకారం చేయించారు. ఇక, తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ క్రియేట్‌ చేశారు. 

అనంతరం, ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్షా, సామ్రాట్ చౌదరి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేడీయూ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, హిందూస్థాన్ ఆవామ్ మోర్చా నుంచి ఇద్దరు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.ఈ ప్రమాణ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా, నితీష్‌ కుమార్‌ బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement