insurgents
-
కేంద్రంతో మణిపూర్ తిరుగుబాటు సంస్థ శాంతి ఒప్పందం
ఇంఫాల్: మణిపూర్ శాంతి ప్రక్రియలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్ఎల్ఎఫ్) కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ఒప్పందంతో ఈశాన్య భారతంలో శాంతి నెలకొల్పే ప్రయత్నంలో కీలక పురోగతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మే3న మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగిన తర్వాత ఓ నిషేధిత సంస్థ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement. It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1 — Amit Shah (@AmitShah) November 29, 2023 శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అమిత్ షా.. "మణిపూర్‌లోని పురాతన సాయుధ సంస్థ యూఎన్ఎల్ఎఫ్ హింసను త్యజించి జన స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. వారిని ప్రజాస్వామ్యంలోకి స్వాగతిస్తున్నాం. శాంతి, అభివృద్ధి ప్రయాణంలో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాల్పుల ఒప్పందంలో భాగంగా సాయుధులు ఆయుధాలను అప్పగిస్తున్న వీడియోను షేర్ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఎనిమిది మైతీ తీవ్రవాద సంస్థలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నవంబర్ 13న పొడిగించింది. వాటిని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించింది. ఈ నిషేధిత సంస్థల్లో యూఎన్ఎల్ఎఫ్ కూడా ఉంది. యూఎన్ఎల్ఎఫ్ సంస్థ శాంతి ఒప్పందం గురించి సీఎం బీరేన్ సింగ్ నవంబర్ 26నే ప్రకటించారు. ఇదీ చదవండి: 41 మంది కార్మికులతో ప్రధాని మోదీ సంభాషణ -
ఆఫ్ఘాన్ దాడుల్లో తిరుగుబాటుదారుల హతం
కాబుల్ : సుదీర్ఘమైన పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న అఫ్ఘానిస్థాన్ రాష్ట్రాలను ఆ దేశ సైన్యాలు జల్లెడపట్టాయి. ఒకరోజుపాటు నిర్వహించిన దాడుల్లో 28 మంది చొరబాటుదారులు హతమయ్యారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి అనంతరం తీవ్రవాదుల ఏరివేతకు ఆఫ్ఘన్ సైన్యాలు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాయని, అందులో భాగంగానే ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాయి. -
రాకెట్ దాడితోనే ఎంహెచ్17 పతనం..
కీవ్, లండన్: ఉక్రెయిన్ తిరుగుబాటుదారుల అధీనంలోని ఉక్రెయిన్ తూర్పుప్రాంతంలో ఇటీవల మలేసియా విమానం కూలిపోవడానికి రాకెట్ ప్రయోగమే కారణమని ఉక్రెయిన్ పేర్కొంది. రాకెట్ పేలుడుతో బయల్పడ్డ పదునైన శకలం బలంగా తాకడంతోనే విమానం కూలిపోయినట్టు బ్లాక్‌బాక్స్‌ల సమాచారం ద్వారా తేలిందని ఉక్రెయిన్ జాతీయ భద్రతా, రక్షణ మండలి ప్రతినిధి ఆంద్రీయ్ లిసెంకో సోమవారం ఈ విషయం చెప్పారు. విమానానికి సంబంధించిన బ్లాక్‌బాక్స్‌లను రష్యా అనుకూల తిరుగుబాటువాదులు మలేసియా అధికారులకు అప్పగించిన తర్వాత, సదరు బ్లాక్‌బాక్స్‌ల డాటాపై విశ్లేషణ బ్రిటన్‌లో జరిగిందని లిసెంకో తెలిపారు. అయితే, విమాన పతనంపై ఉక్రెయిన్ అధికారి వెల్లడించిన తాజా సమాచారాన్ని నెదర్లాండ్స్ మాత్రం ధ్రువీకరించలేదు. విమానం కూలిన ప్రమాదంలో 193మంది నెదర్లాండ్స్ పౌరులు మర ణించిన సంగతి తెలిసిందే. -
తిరుబాటుదారులు జనజీవన స్రవంతిలో కలవండి
రాష్ట్రంలో తిరుగుబాటుదారులు హింసకు స్వస్తి పలకాలని మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ గురువారం ఇంఫాల్‌లో వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపడుతున్న అభివృద్ధి పథకాల్లో భాగస్వాములు కావాలని ఆయన తిరుబాటుదారులకు సూచించారు. తిరుబాటుదారులతో చర్చలకు ప్రభుత్వ తలుపులు ఎల్లప్పుడు తెరిచే ఉంటాయన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో హింసకు తావుండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. 67వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని రాష్ట్ర రాజధాని ఇంఫాల్ పేరెడ్ గ్రౌండ్లో ఓక్రాం ఇబోబీసింగ్ జెండా ఆవిష్కరణ చేసి, ప్రభుత్వ దళాలు అందించిన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి కొద్ది నిమిషాల ముందు పేరెడ్ గ్రౌండ్లో సమీపంలోని మిరంగ్కొమ్ ప్రాంతంలోని పేట్రోల్ బంక్ వద్ద బాంబు పేలుడు సంభవించింది. అయితే ఆ ఘటనలో ఎవరు గాయపడలేదని ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్టవ్యాప్తంగా ఆ ఒక్క సంఘటన మినహా మరెక్కడ ఎటువంటి ఘటన చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది. అయితే ఇటీవలే ముఖ్యమంత్రి ఓక్రాం ఇబోబీసింగ్ నివాసం వద్ద బాంబుపేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.