
కాబుల్ : సుదీర్ఘమైన పాకిస్థాన్ సరిహద్దును ఆనుకుని ఉన్న అఫ్ఘానిస్థాన్ రాష్ట్రాలను ఆ దేశ సైన్యాలు జల్లెడపట్టాయి. ఒకరోజుపాటు నిర్వహించిన దాడుల్లో 28 మంది చొరబాటుదారులు హతమయ్యారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతి దాడి అనంతరం తీవ్రవాదుల ఏరివేతకు ఆఫ్ఘన్ సైన్యాలు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టాయని, అందులో భాగంగానే ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు పేర్కొన్నాయి.